వీర్యం చిక్కని ద్రవం. ఈ చిక్కదనం ఒక్కో పురుషుడిలో ఒక్కోలా ఉంటుంది. యోనిలో వీర్యం స్ఖలించినపుడు, పురుషాంగం అందులోనే ఉన్నందున కొంత ద్రవం బయటకు రావడం సహజమే.
అలా వీర్యం బయటకు రావడం వల్ల నష్టమేమీ ఉండదు. అయినా యోనిలో స్ఖలించిన వీర్యం పూర్తిగా అందులోనే ఉండాలంటే యోని పైకి ఎత్తిన భంగిమలో సెక్స్ చేసుకోవాలి.
ఈ భంగిమలో స్ఖలించిన వీర్యం మొత్తం యోనిలోనే నిలుస్తుంది. ఒకవేళ అప్పటికీ వీర్యం బయటకు వస్తే దాని గురించి ఆందోళన చెందనవసరం లేదు. యోని నుంచి వీర్యం బయటకు పోవడం వల్ల పిల్లలు పుట్టరనుకోవడం కేవలం అపోహ మాత్రమే.