కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం - కాలిబూడిదైన శివపార్వతి థియేటర్  
                                       
                  
                  				  హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో స్థానికంగా ఉన్న శివపార్వతి థియేటర్ కాలిబూడిదైంది. ఈ సినిమా హాలులో సంభవించిన అగ్నిప్రమాదంలో థియేటర్ కాలిపోయింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది మూడు ఫైరింజన్లతో వచ్చి మంటలను ఆర్పివేశాయి. 
				  											
																													
									  
	 
	ఈ ప్రమాదం జరిగిన రాత్రి సమయంలో కావడంతో పెను విపత్తు తప్పింది. సినిమా ప్రదర్శన ముగిసిన తర్వాత అర్థరాత్రి దాటాక ఈ ప్రమాదం జరిగింది. దీంతో ప్రాణనష్టం తప్పింది. అయితే, థియేటర్ సామాగ్రి పూర్తిగా కాలిపోవడంతో ఆస్తి నష్టం వాటిల్లింది. 
				  
	 
	కాగా, థియేటర్‌లో ఏర్పడిన విద్యుదాఘాతం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో థియేటర్‌లోని సామాగ్రి మొత్తం కాలిపోయింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.