బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 1 జనవరి 2021 (19:30 IST)

షాపింగ్‌ మాల్స్‌పై.. జీహెచ్‌ఎంసీ కొరడా

నిబంధనలు అతిక్రమించిన షాపింగ్‌మాల్స్‌, కమర్షియల్‌ కాంప్లెక్స్‌, హోటల్స్‌పై జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విజిలెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ కొరడా ఝళిపించింది. పర్మిషన్‌ లేకుండా ఇష్టానుసారంగా బోర్డులు ఏర్పాటు చేస్తున్న బడా సంస్థలపై స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతూ జరిమానాలు విధిస్తున్నారు.

ఇందులో భాగంగానే నేమ్స్‌ బోర్డు అతిక్రమణలపై పలు షాపింగ్‌ మాల్స్‌, హోటల్స్‌, వాణిజ్య సంస్థలకు నోటీసులు జారీచేసి, వారి నుంచి జరిమానాలు వసూలు చేసినట్లు ఈవీడీఎం విభాగం అధికారులు గురువారం తెలిపారు. కాగా రూల్స్‌ ప్రకారం షాపింగ్‌మాల్‌ బిల్డింగ్‌లో 15శాతం వరకు మాత్రమే నేమ్‌ బోర్డులకు పర్మిషన్‌ ఉంది.

కానీ చాలా షాపింగ్‌ మాల్స్‌, వాణిజ్య సంస్థల వారు నిబంధనలను అతిక్రమిస్తున్నారు. నేమ్‌ బోర్డుల అతిక్రమణను రెగ్యులేట్‌ చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 68ని పక్కాగా అమలు చేయాలన్న లక్ష్యంతో ఈవీడీఎం అధికారులు స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఆయా షాపు విస్తీర్ణాన్ని బట్టి నిబంధనలు అతిక్రమించిన వాటికి వేల నుంచి లక్షల్లో జరిమానాలు విధిస్తున్నారు.