బుధవారం, 13 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 23 జులై 2024 (10:50 IST)

అక్కినేని నాగేశ్వరావు జాతీయ అవార్డులు ఇక లేనట్లేనా?

nageswrarao
nageswrarao
పద్మ విభూషణ్ నట సామ్రాట్ పద్మశ్రీ డాక్టర్ అక్కినేని నాగేశ్వరావు గారి శత జయంతి సంబరాల్లో భాగంగా గుడివాడ దగ్గర అక్కినేని వారి స్వగ్రామం వెంకట రాఘవపురం నందు శత జయంతి వేడుకలు నిర్వహించారు రాష్ట్రఅక్కినేని ఆర్ట్స్అసోసియేషన్ వారు ఈ సందర్భంగా గ్రామములోని 100 మందికి అన్నదానం నిర్వహించడం జరిగినది 
 
ఈ కార్యక్రమంలో పెద్దలు పురాణం వెంకటరమణ గారు, సుబ్బారావు గారు, నవీన్ ప్రసాద్, బి ఆర్ దాసు, వెంకట ముని, సుకుమార్ రెడ్డి, ప్రభాకర్ రావు, షఫీ, తదితర పెద్దలు అక్కినేని వారి గురించి అనర్గళంగా స్పీచ్ ఇవ్వడం జరిగినది.
 
కాగా, పద్మ విభూషణ్ నట సామ్రాట్ పద్మశ్రీ డాక్టర్ అక్కినేని నాగేశ్వరావు బతికుండగానే తన పేరిట జాతీయస్థాయి అవార్డులు ప్రకటించారు. అందుకు పదికోట్ల రూపాయల మొత్తాన్ని నిధి కింద బ్యాంక్ లో జమ చేశారు. దీనికి అక్కినేని కుటుంబసభ్యులతోపాటు టి. సుబ్బరామిరెడ్డి కూడా ట్రస్టీగా వున్నారు. ఆ తర్వాత నాగేశ్వరరావు కాలం చేసినా కొద్దికాలం అవార్డుల ప్రదాన కొనసాగింది. కానీ ఏమైందోె ఏమో షడెన్ గా అవార్డుల ప్రదానం నిలిచిపోయింది. అక్కినేని అభిమానులు కూడా అవార్డు ప్రక్రియ కొనసాగాలని ఆశిస్తున్నారు. మరి నాగార్జున ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.