తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో..
రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తేలికపాటి నుండి మోస్తరు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో తాజా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లోని వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో ఉరుములు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే అవకాశం వుందని.. అంచనా వేస్తున్నారు. రానున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.