మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 2 మార్చి 2018 (12:02 IST)

మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ ఎన్‌కౌంటర్

తెలంగాణ రాష్ట్రంలో భారీఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ హతమయ్యాడు. ఈ ఎన్‌కౌంటర్ చత్తీస్‌గఢ్ - తెలంగాణ సరిహద్దులో జరిగింది.

తెలంగాణ రాష్ట్రంలో భారీఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ హతమయ్యాడు. ఈ ఎన్‌కౌంటర్ చత్తీస్‌గఢ్ - తెలంగాణ సరిహద్దులో జరిగింది. భూపాలపల్లి జిల్లా వెంకటాపురం సరిహద్దులోని తడపలగుట్ట, పూజారీ కాంకేడ్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. 
 
తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో మొత్తం 12 మంది మావోయిస్టులు చనిపోయినట్టు సమాచారం. మృతుల్లో ఆరుగురు మహిళా మావోయిస్టులు ఉన్నట్టు తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేతలు హరిభూషణ్, ఖమ్మం జిల్లా కార్యదర్శి కొయ్యడ సాంబయ్య, అలియాస్ గోపన్న… సెంట్రల్ రెవల్యూషనరీ కమిటీ కార్యదర్శి సాగర్ మృతి చెందారు. 
 
ఈ ఎన్‌కౌంటర్‌లో గ్రౌహౌండ్స్ కానిస్టేబుల్ సుశీల్ కూడా చనిపోయాడు. వికారాబాద్‌కు చెందిన సుశీల్…. 2004 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్‌గా గుర్తించారు. మృతదేహాలను భద్రాచలం ఏరియా హాస్పిటల్‌కు తరలించారని సమాచారం. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీగా ఆయుధాలు, ఏకే 47 తుపాకులు, స్కానర్, ల్యాప్ టాప్‌తో పాటు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.