Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విద్యార్థినిని పెళ్లాడిన హెడ్ మాస్టర్.. 13ఏళ్ల బాలుడితో 23 ఏళ్ల యువతి వివాహం.. ఎక్కడ?

శుక్రవారం, 11 మే 2018 (16:45 IST)

Widgets Magazine

మాయమాటలు చెప్పి స్కూల్ హెడ్ మాస్టరే ఓ విద్యార్థిని జీవితాన్ని నాశనం చేశాడు. విద్యార్థినితో పారిపోయాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ గ్రామంలో వెలుగుచూసింది. వివరాల్లోకెళితే.. ముచ్చింతల్‌‌కు చెందిన ఓ బాలిక పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణురాలు కాలేకపోయింది. 
marriage
 
ఫెయిలైన సబ్జెక్ట్.. పాస్ చేయిస్తానని చెప్పి బాలికకు మాయమాటలు చెప్పి హెడ్ మాస్టర్ అక్బర్ ఆమెను తీసుకెళ్లిపోయాడు. ఆ తర్వాత బాలికను పెళ్లి చేసుకున్నాడని తెలుస్తోంది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు శంషాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు.. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
మరోవైపు కర్నూలు జిల్లా సరిహద్దు మండలమైన కౌతాళంలోని ఓ కుగ్రామంలో వింత వివాహం జరిగింది. ఏప్రిల్ 27న జరిగిన ఈ వివాహం సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో వరుడి వయసు కేవలం 13 ఏళ్లు కాగా, వధువు వయసు 23 ఏళ్లు. 
 
భర్త మద్యానికి బానిస కావడం, తాను అనారోగ్యంతో బాధపడుతుండడంతో తాను మరణిస్తే పిల్లల గతి ఏమవుతుందోనని ఆలోచించిన ఆ తల్లి పెద్ద కుమారుడికి పెళ్లి చేయాలని నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా బంధువుల అమ్మాయి (23)తో ఏప్రిల్ 27న పెళ్లి జరిపించింది. వివాహానికి వచ్చిన వారు వరుడిని చూసి అవాక్కయ్యారు. కొందరు కోపం పట్టలేక పెళ్లి పెద్దలను తిట్టిపోశారు. ఇదో రకమైన బాల్య వివాహమంటూ మండిపడ్డారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అమిత్ షా కాన్వాయ్‌పై రాళ్లదాడి.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. క్రమశిక్షణగా?

కర్ణాటక ఎన్నికల ప్రచారాన్ని ముగించుకున్న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం తిరుమల ...

news

మా కెసిఆర్‌‌కు ఆ కళ వచ్చేసిందని తెలంగాణ ప్రజలు చెప్పుకుంటున్నారా?

బిజెపికి, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు చేస్తానంటూ రాష్ట్రాలు ...

news

స్వామి నువ్వు గెలిపిస్తావు.. నాకు తెలుసు: శ్రీవారిని ప్రార్థించిన అమిత్ షా

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కర్ణాటక ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. ఒకవైపు కాంగ్రెస్, ...

news

పశ్చిమ గోదావరి: పడవలో అగ్నిప్రమాదం.. 120 మంది ప్రయాణీకులు?

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం, బియ్యపుతిప్ప- ఉప్పుటూరు వద్ద గోదావరిలో పడవ బోల్తా ...

Widgets Magazine