Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎమ్మెల్యేతో రాహుల్ గాంధీ వివాహం.. సోషల్ మీడియాలో వైరల్

ఆదివారం, 6 మే 2018 (11:51 IST)

Widgets Magazine

దేశ రాజకీయ నేతల్లో మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ ఎవరైనా ఉన్నారంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఈయన వయసు నాలుగు పదులు దాటినప్పటికీ పెళ్లి మాట అనుకోవడం లేదు.
 
ఈనేపథ్యంలో, రాహుల్ గాంధీ పెళ్లిపై సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. రాయ్‌బరేలీ ఎమ్మెల్యే అదితి సింగ్‌ను ఆయన పరిణయం ఆడనున్నారని గతకొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పుకార్లపై అదితి తొలిసారి స్పందించారు.
aditi singh
 
అన్నాచెల్లెళ్ల మధ్య వివాహం జరుగుతోందని ప్రచారం చేస్తున్నారని మండిపడిన ఆమె... పుకార్లను వినగానే తన ప్రపంచం తలకిందులైనట్లు అనిపించిందన్నారు. ఈ వార్తలో ఎటువంటి నిజమూ లేదని, తన చేత్తో రాఖీ కట్టిన రాహుల్ గాంధీ, తనకు అన్నయ్యని, ఈ పుకార్లతో తాను చాలా బాధపడ్డానని అన్నారు. 
 
కాగా, రాయ్ బరేలీలోని వాట్స్ యాప్ గ్రూపుల నుంచి ఈ పుకార్లు ప్రారంభం కాగా, దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఇక అదితి సింగ్, రాయ్ బరేలీ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అఖిలేష్ సింగ్ కుమార్తె. ప్రస్తుతం ఆమె వయసు 29 సంవత్సరాలు. 
 
యూఎస్‌లోని డ్యూక్ యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆమె, గత ఎన్నికల్లో 90 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ప్రియాంకా గాంధీకి అదితి సన్నిహితురాలు కూడా. అందువల్లే ఆమెకు, రాహుల్‌కు వివాహమంటూ ఎవరో పుకార్లు సృష్టించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వారితో ప్రాక్టికల్స్ చేస్తేనే.. ప్రాక్టికల్ మార్కులు వేస్తారట.. గవర్నర్‌కు విద్యార్థిని లేఖ

తిరుపతి రుయా చిన్నపిల్లల ఆస్పత్రిలో పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్న కొందరు విద్యార్థులు ...

news

ఓటింగ్‌కు దూరంగా ఉండేవారినీ చేతులు కట్టేసి లాక్కొచ్చి... యడ్యూరప్ప

ఈనెల 12వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. 15వ తేదీన ఫలితాలు ...

news

ట్రీట్మెంట్ తీసుకుంటున్న మహిళా రోగిపై వార్డ్ బోయ్ అత్యాచారం

కామాంధులు ఆంబోతుల్లా విహరిస్తున్నట్లే వుంది. రోగులను కూడా వదలడంలేదు ఈ కామాంధులు. తెలంగాణ ...

news

ఈ మజ్జిగ ఇంత పుల్లగా వున్నాయేమిటండీ... తితిదే ఛైర్మన్ అసహనం(Video)

టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ శనివారం సర్వదర్శనం కౌంటర్‌లు పరిశీలించి భక్తులతో ...

Widgets Magazine