శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2016 (11:36 IST)

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి... త్రివర్ణ పతాకంలోని రంగులు దేనికి ప్రతీక!

ప్రతి భారతీయుడూ ఆదరించి, అభిమానించే మూడు రంగుల జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలుగువారి ఖ్యాతిని

ప్రతి భారతీయుడూ ఆదరించి, అభిమానించే మూడు రంగుల జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలుగువారి ఖ్యాతిని పింగళి వెంకయ్య ప్రపంచానికి చాటిచెప్పారన్నారు. భారత జాతీయోద్యమంలో కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. సత్యం, అహింసలను ఆచరించటం వల్ల దేశం సుభిక్షంగా ఉంటుందని విశ్వసించిన మహనీయుడు ఆయన అని చంద్రబాబు అన్నారు.
 
పింగళి వెంకయ్య భారత స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. విభిన్న ఆందోళనలలో భాగస్వామ్యుడై, నిస్వార్ధ సేవానురక్తుడై, దేశ స్వతంత్రానుక్తుడై, నిబద్ధతతో జీవనం సాగించి, మంచి ఉపన్యాసకుడిగా, వ్యవసాయ క్షేత్రాభివృద్ధికి తోడ్పడిన వ్యక్తిగా జన బాహుల్యానికి పరిచయమైన వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోయారు. 
 
శ్రీపింగళి 1876, ఆగస్టు 2న కృష్టా జిల్లా దివి తాలూకలోని భట్లపెనుమర్రు గ్రామంలో జన్మించారు. 1921 మార్చి 31వ తేదీన విజయవాడలో జరిగిన భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో జెండాను రూపొందించి అందించారు. ఈ త్రివర్ణ పతాకంలో ఉండే మూడు గుర్తులు... కేసరి (కాషాయం) - ధైర్య, సాహసాలకు ప్రతీక, తెలుపు - శాంతి, సత్యాలకు, ఆకుపచ్చ - విశ్వాస, సౌభ్రాతృత్వానికి ప్రతీకలు.