Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం.. ఆ పార్టీ నుంచే అంటోన్న కలెక్షన్ కింగ్

శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (21:12 IST)

Widgets Magazine
Mohan Babu

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఈయన ఎక్కడ మాట్లాడినా అది సెన్సేషనలే. అదిరిపోయే డైలాగ్‌లతో మాట్లాడటమే మోహన్ బాబుకు ఉన్న అలవాటు. అయితే అందరినీ నొప్పించరు కానీ.. తాను నొచ్చుకునేలా మాత్రం ఎవరైనా ప్రవర్తిస్తే ఇక వారి భరతం పడతారు. అది మోహన్ బాబు స్టైల్. మోహన్ బాబు ముందు నుంచి ముక్కుసూటి మనిషిగానే ఉంటారన్నది అందరికీ తెలిసిందే. అయితే మోహన్ బాబు ప్రత్యక్ష రాజకీయల్లోకి రావడం దాదాపు ఖాయమైంది. ముందస్తు ఎన్నికలకు సమీపిస్తున్న నేపథ్యంలో మోహన్ బాబు తిరిగి రాజకీయాల్లోకి వెళ్ళాలన్న నిర్ణయానికి వచ్చేశారు.
 
అది కూడా వచ్చే ఎన్నికల్లో ఒక పార్టీ తరపున పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఆ పార్టీయే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీలో మోహన్ బాబు చేరడం దాదాపు ఖాయమైంది. అయితే మోహన్ బాబు గతంలో మాదిరిగా ఎంపిగా పోటీ చేస్తారా.. లేకుంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అన్నది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఆయనొక్కరే కాదు మంచు ఫ్యామిలీలోని మరో ఇద్దరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళి ప్రజాప్రతినిధులుగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా చాలా జాగ్రత్తపడుతున్నారు మోహన్ బాబు. 
 
ఈమధ్య ఒక టివి ఛానల్ ఇంటర్వ్యూలో మోహన్ బాబును ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకు ఇలాంటి సమాధానమే ఇచ్చారు. నువ్వు మెడకేసి.. మళ్ళీ కాలికేస్తే మాత్రం ఉపయోగముండదు. నా సమాధానం ఒక్కటే. నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా.. అది ఏ పార్టీ అన్నది మాత్రం చెప్పనని తేల్చారు. కానీ ఇప్పటికే వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో శ్రీకాళహస్తి, చంద్రగిరి ఎమ్మెల్యే సీట్లు దాదాపుగా మోహన్ బాబు ఫ్యామిలీకి కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వృద్ధులు, పెద్దవాళ్లు పనికిరానివాళ్లా? ఐతే ఇక్కడ చూడండి...

ఈ ఆధునిక ప్రపంచంలో ఉమ్మడి కుటుంబం అనేది చాలా అరుదుగా కనపడుతుంది. ఉమ్మడి కుటుంబము అనగానే ...

news

బీజేపీతో ఇంకా అంటకాగితే చిత్తుగా ఓడిస్తారు : చంద్రబాబుతో నేతలు

ఇప్పటికీ మునిగిపోయిందీ లేదు.. బీజేపీతో ఉన్న స్నేహ బంధానికి కటీఫ్ చెప్పేద్ధాం. లేకుంటే ...

news

కేంద్ర బడ్జెట్ పైన నారా బ్రహ్మిణి పొగడ్తలు... తెదేపా నేతలు షాక్...

కేంద్ర బడ్జెట్ పైన సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తే ...

news

తొందరపడొద్దు... అదును చూసి దెబ్బకొడదాం : నేతలతో చంద్రబాబు

కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ...

Widgets Magazine