శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 17 జనవరి 2018 (10:37 IST)

జగన్‌కు షాక్.. టీడీపీలోకి వంగవీటి రాధ

సుదీర్ఘ పాదయాత్రలో నిమగ్నమైవున్న వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి తేరుకోలేని షాక్ తగలనుంది. విజయవాడ రాజకీయాల్లో కేంద్ర బిందువు అయిన వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధ వైకాపాకు గుడ్‌బై చెప్పి అధికార తె

సుదీర్ఘ పాదయాత్రలో నిమగ్నమైవున్న వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి తేరుకోలేని షాక్ తగలనుంది. విజయవాడ రాజకీయాల్లో కేంద్ర బిందువు అయిన వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధ వైకాపాకు గుడ్‌బై చెప్పి అధికార తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఇదే జరిగితే విజయవాడ రాజకీయాలు మరోసారి కీలక మలుపుతిరిగే అవకాశం ఉంది. 
 
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు వంగవీటి రాధతో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించారన్న విషయం జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా వంగవీటి రాధ పార్టీ మార్పుపైనే చర్చ జరుగుతోంది. ఈ విషయంలో రాధ నోటి నుంచి అధికారికంగా ఏ విషయమూ బయటకురానప్పటికీ, అటు తెలుగుదేశం వర్గాలు, ఇటు రాధ అనుచరులు పార్టీ మార్పు ఖాయమంటున్నారు. 
 
రాధతో చర్చలు పూర్తయ్యాయని కొందరు టీడీపీ సీనియర్ నేతలు వ్యాఖ్యానించారు. తనకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఖాయం చేసిన పక్షంలో పార్టీ మారేందుకు రాధ సిద్ధంగా ఉన్నారనీ, ఈ విషయమై తమతో చర్చించారని ఆయన ప్రధాన అనుచరులు చెబుతున్నారు. 
 
కాగా, గత కొంతకాలంగా వైసీపీలో అసంతృప్తిగా ఉంటున్న వంగవీటి రాధ, పార్టీలో తనకు తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావిస్తున్నారు. ఈ విషయాన్ని తన అనుచరుల వద్ద చాలాసార్లే ప్రస్తావించారట రాధ. వంగవీటి రాధ టీడీపీలో చేరితే, అది వైకాపాకు కోలుకోని దెబ్బే.