Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'కమలం'కు టాటా... 'హస్తం' గుర్తుకు జై అంటున్న నాగం జనార్థన్ రెడ్డి

శుక్రవారం, 12 జనవరి 2018 (10:48 IST)

Widgets Magazine
nagam

తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి ఆ రాష్ట్రంలో సీనియర్ నేతగా ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి గుడ్‌బై చెప్పారు. అదేసమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. పార్టీలో తనకు సరైన గుర్తింపు దక్కలేదని భావిస్తున్న మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపిస్తూ, పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. 
 
కేసీఆర్ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తున్న తాను పార్టీలో నిరాదరణకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి అనుభవజ్ఞుడి సేవలను వినియోగించుకోవడంలో పార్టీ విఫలమైందన్నారు. పార్టీలో తాను పలుమార్లు అవమానానికి గురయ్యానని తెలిపారు. అనుచరులు, అభిమానుల సూచనతోనే తాను పార్టీని వీడుతున్నట్టు స్పష్టం చేశారు.
 
అదేసమయంలో ఆయన కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి వంటి పలువురు టీడీపీ నేతలు సొంత పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెల్సిందే. పైగా, కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలంతా రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలే కావడం గమనార్హం. అందువల్ల నాగం జనార్ధన్ రెడ్డి హస్తం గుర్తుకే ఓటువేయనున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఇస్రోకు "వంద"నం.. విఫలం తర్వాత విజయం (వీడియో)

భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ40 విజయవంతమైంది. తనతో పాటు తీసుకెళ్లిన ...

news

ఆ ముం.... కొడుకులే ఇపుడు మంత్రివర్గంలో ఉన్నారు : మంత్రి నాయిని బూతుపురాణం

తెలంగాణ ఉద్యమం సమయంలో తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావును పరుష పదజాలంతో తిట్టిన నేతలే ఇపుడు ...

news

కాపురం చేసేందుకు రూ. 3 కోట్లు అడిగిందన్న భర్త, రూ.20 వేలు చెల్లించి ఇంట్లో వుండనివ్వండి...

బోడుప్పల్‌లో గత 53 రోజులుగా తనకు న్యాయం చేయాలంటూ తన భర్త శ్రీనివాస్ రెడ్డి ఇంటి ఎదుటే ...

news

పవన్ వీరాభిమాని బండ్ల గణేష్‌పై అట్రాసిటీ కేసు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని, సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌పై ఎస్సీఎస్టీ ...

Widgets Magazine