Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వంగవీటి రాధ ఎంట్రీకి ముహూర్తం.. మల్లాది విష్ణుకు సీటు ఖరారు

బుధవారం, 17 జనవరి 2018 (12:02 IST)

Widgets Magazine
vangaveeti radha

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ కేంద్రమైన విజయవాడలో బుధవారం రెండు ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. అందులో ఒకటి వైకాపాకు చెందిన సీనియర్ నేత వంగవీటి రాధ సొంత పార్టీకి టాటా చెప్పి అధికార టీడీపీలో చేరబోతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలను నిజం చేస్తూ ఆయన ఈనెలాఖరులోగా సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు, వంగవీటి రాధ తమకు దూరం కావడం ఖాయమని నిర్ధారణకు రావడంతో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారు. కొద్దికాలం క్రితం మల్లాది విష్ణు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెల్సిందే. ఆ సమయంలోనే విష్ణుకు విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ టికెట్‌ను వైఎస్.జగన్ ఖరారు చేశారన్న వార్తలు వచ్చాయి. 
 
వాస్తవానికి ఆ సీటుపై వంగవీటి రాధ ఎప్పటినుంచో ఆశలు పెట్టుకునివున్నారు. కానీ, విష్ణు వైకాపా రంగ ప్రవేశం తర్వాతనే రాధ తొలిసారిగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు రాధ టీడీపీ నుంచి ఆ సీటు తనకిస్తానన్న హామీ ఇవ్వడంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. వాస్తవానికి విజయవాడ సెంట్రల్ పరిధిలో మల్లాది విష్ణుతో పోలిస్తే, వంగవీటి రాధ బలమైన నేతగా చెప్పుకోవచ్చు. అదేసమయంలో మల్లాది విష్ణుకు కూడా వైకాపా నుంచి ఇదే స్థానాన్ని ఖరారు చేసినట్టు సమాచారం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బెంగళూరులో రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు: సీఐ భార్య మెడలోని?

బెంగళూరులో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. సంక్రాంతి రోజున ఇంటి ముందు ముగ్గులు పెట్టే ...

news

వ్యక్తిగత సెక్యూరిటీగార్డును కొట్టిన మధ్యప్రదేశ్ సీఎం (వీడియో)

బీజేపీ పాలిత ముఖ్యమంత్రుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్ర ...

news

కాన్పూర్‌లో కట్టలు కట్టలుగా పాత నోట్లు.. (వీడియో)

రద్దైన నోట్లు కట్టలు కట్టలుగా బయటపడ్డాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లోని ఓ తాళం ...

news

కెమికల్ ఇంజనీర్ సన్యాసం స్వీకరించాడు.. ఎందుకు?

ఐఐటీ-బాంబే కెమికల్ ఇంజనీర్‌ సన్యాసం స్వీకరించనున్నాడు. సమాజ శ్రేయస్సు కోసం దేవుడిని ...

Widgets Magazine