Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జగన్‌కు అధికారాన్ని అప్పజెప్పనున్న చంద్రబాబు.. ఎలా..?

ఆదివారం, 5 నవంబరు 2017 (15:06 IST)

Widgets Magazine
chandrababu naidu-KCR

వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో తెరాస, టీడీపీలు కలిసి పొత్తుపెట్టుకుంటే ఏపీలో అధికారాన్ని జగన్‌కు చంద్రబాబు బంగారు పల్లెంలో పెట్టి అప్పగిస్తుందన్నది రాజకీయ విశ్లేషకుల భావన. తెరాసతో టీడీపీ పొత్తు అనేది ఆత్మహత్యతో సమానమని పలువురు నేతలు చర్చించుకుంటున్నారు. చంద్రబాబునాయుడు ఒక్కోసారి తీసుకునే అనాలోచిత నిర్ణయాలే తెలంగాణా రాష్ట్రంలో ఇబ్బందులకు కారణమవుతాయంటున్నారు ఆ పార్టీ నేతలు. 
 
పచ్చగా ఉన్న సమైక్య రాష్ట్రాన్ని విభజించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఏ గతి పట్టిందో తెలిసిందే. ఇదేవిధంగా చంద్రబాబు ఆలోచనలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ నేతల నిర్ణయాలను బాబు కూడా ఫాలో అవుతున్నారా? అన్న అనుమానాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చర్చ జరుగుతుందంటే గత కొన్నిరోజుల ముందు టీడీపీలోని సీనియర్ నేతలు బాబుతో చర్చలు జరిపి వచ్చే ఎన్నికల్లో తెరాసతో కలిసి పోటీ చేస్తే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
 
ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీని తెలంగాణా రాష్ట్రంలో కనుమరుగుకాకుండా చేయాలంటే ఇది ఒక్కటే మార్గమన్న నిర్ణయానికి వచ్చేశారు. అందుకే సీనియర్ నేతలు చెప్పిన వాటికి ఒకే అనేశారు బాబు. ముందు నుంచి ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన రేవంత్ పార్టీ మారిపోవడానికి కారణం కూడా ఇదే. పైగా, ఇపుడు తన నిర్ణయాన్ని ప్రశ్నించే వారు లేకపోవడంతో తెరాసతో కలిసిపోవాలన్న నిర్ణయానికి వచ్చేశారు చంద్రబాబు. రాష్ట్ర విభజనకు ప్రధాన కారణమైన కేసీఆర్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏపీలో కూడా మూల్యం చెల్లించుకోకతప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలాంటి పరిస్థితుల్లో బాబు ఏ విధంగా ముందుకు వెళతారన్నది చర్చనీయాంశంగా మారింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జగన్ పనికిమాలిన పాదయాత్ర అవసరమా : రామకృష్ణ

ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఏ ఉద్దేశంతో చేస్తున్నాడో ప్రజలకు సమాధానం ...

news

దమ్ముంటే కమలహాసన్‌ను కాల్చి చంపండి : సిపిఐ జాతీయ నేత నారాయణ

బీజేపీ వచ్చాక హిందూ ఉగ్రవాదం పెరిగిందంటూ వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు కమల్ హాసన్‌‌ను ...

news

పెళ్లికొడుకు ఒకరే.. పెళ్లికూతుళ్లు ఇద్దరు... సినిమా టైటిల్ కాదు...

పెళ్లికొడుకు ఒకరే.. పెళ్లికూతుళ్లు ఇద్దరు... ఇదేం సినిమా టైటిల్ కాదు. నిజమైన పెళ్లికి ...

news

భారతీయ వంటకాలతో పోస్టల్ స్టాంపులు.. తిరుపతి లడ్డూకు స్టాంప్

తెలుగింటి వంటకాలకు అరుదైన గౌరవం దక్కింది. భారతీయ తంతి తపాలా శాఖ తాజాగా భారతీయ వంటకాలతో ...

Widgets Magazine