బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 13 నవంబరు 2017 (11:45 IST)

అన్నీ చంద్రబాబుకే అప్పగించా.. ఆయనే చూసుకుంటారు: వాణీ విశ్వనాథ్

టాలీవుడ్‌లో వానపాటల హీరోయిన్‌గా గుర్తింపు పొందిన నటి వాణీ విశ్వనాథ్. ఈమె త్వరలోనే రాజకీయాల్లోకి ప్రవేశించనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం పార్టీలో చేరనుంది. ఈ విషయాన్ని ఆమె అధికారికం

టాలీవుడ్‌లో వానపాటల హీరోయిన్‌గా గుర్తింపు పొందిన నటి వాణీ విశ్వనాథ్. ఈమె త్వరలోనే రాజకీయాల్లోకి ప్రవేశించనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం పార్టీలో చేరనుంది. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా కూడా ప్రకటించింది. 
 
ఈనేపథ్యంలో ఎన్.బీ.కే (నందమూరి బాలకృష్ణ) హెల్పింగ్ హ్యాండ్ ఆధ్వర్యంలో అనంతపురంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి ఆమె తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తాను త్వరలోనే టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. 
 
పార్టీలో ఎలాంటి పాత్రను పోషించాలి? ఎక్కడ నుంచి పోటీ చేయాలి? అనే విషయాలను చంద్రబాబే నిర్ణయిస్తారని చెప్పారు. చిన్న వయసు నుంచే తనకు రాజకీయాలు అంటే ఇష్టమని... పాలిటిక్స్‌లోకి రావాలని తనకు ఎప్పటి నుంచో కోరిక ఉందని, ఇపుడు ఆ కోర్కెను నెరవేర్చుకోనున్నట్టు తెలిపారు. 
 
తెలుగు ప్రజలపై ఉన్న అభిమానంతోనే తాను ఏపీకి వచ్చానని... అనంతపురం ప్రజలు చూపిన అభిమానాన్ని తాను మర్చిపోలేనని చెప్పారు. అలాగే, టీడీపీ అధినేత చంద్రబాబు ఒక గొప్ప నాయకుడు మాత్రమే కాకుండా, మంచి విజన్ ఉన్న నేత అని, ఆయన చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను చూసే, టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు ఆమె స్పష్టంచేశారు.