రోజాను ఓడించడం పెద్ద కష్టేమేమీ కాదు... వాణీ విశ్వనాథ్

సోమవారం, 6 నవంబరు 2017 (20:55 IST)

Roja-Vani Viswanath

వైఎస్సార్సీపి ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే రోజాను ఎన్నికల్లో ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని నటి వాణీ విశ్వనాథ్ అంటున్నారు. సోమవారం నాడు ఆమె విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు మీరు సిద్ధమైపోయారని అనుకుంటున్నారన్న ప్రశ్నకు... ఆ విషయం నేను మైండ్‌లో ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను. 
 
ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీలో చేరడంపై ఆలోచించేదేమీ లేదు. నేను చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీలో త్వరలోనే చేరుతాను. వచ్చే ఎన్నికల్లో రోజాను ఓడించగలరా అని ఓ విలేకరి అడుగగా... రోజాను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. 
 
తెలుగుదేశం పార్టీ ప్రజల అభివృద్ధి కోసం అన్నివిధాలా పనిచేస్తుందనీ, పాటుపడుతుందని చెప్పుకొచ్చారు. లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రం గురించి స్పందిస్తూ.. ఈ చిత్రంలో నటించాల్సిందిగా ఓ ఫోన్ కాల్ తనకు వచ్చినమాట నిజమేననీ, కాకపోతే ఆ చిత్రంలో నటిస్తానా లేదా చెప్పలేనన్నారు. తన మేనేజర్ నెంబరు ఇచ్చి అతడితో చర్చించాల్సిందిగా సలహా ఇచ్చినట్లు చెప్పారు.దీనిపై మరింత చదవండి :  
Electios Mla Roja Vani Viswanath Ap Elections

Loading comments ...

తెలుగు వార్తలు

news

1000 మంది పురుషులకు 938 మంది మహిళలు... లింగ నిర్ధారణ పరీక్షలను అడ్డుకోవాలి

అమరావతి: రాష్ట్రంలో లింగనిర్ధారణ పరీక్షలకు వ్యతిరేకంగా విస్తృత స్థాయిలో ప్రచారం ...

news

రేవంత్ రెడ్డి ఫిలమెంట్ ఎగిరిపోయే వ్యాఖ్యలు... ఉత్తమ్ అలా అనేశారే...

చింత చచ్చినా పులుపు చావలేదు అనే సామెత తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ...

news

జగన్ పాదయాత్ర మొదటిరోజే అపశృతి... గుండెపోటుతో కార్యకర్త మృతి

ఆరు నెలల పాటు 3 వేల కిలోమీటర్ల మేర ప్రజా సంకల్ప యాత్ర పేరిట జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ...

news

రాహుల్ గాంధీ 'Gabbar Singh Tax', మమతా బెనర్జీ 'Great Selfish Tax'

పెద్ద నోట్ల రద్దుకు వచ్చే నవంబరు 8తో సంవత్సరం కావొస్తోంది. ఈ నోట్ల రద్దుతో పలు పరిశ్రమలకు ...