శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 25 అక్టోబరు 2014 (09:28 IST)

ప్రేమించూ... అంటూ వేధించిన యువకుడికి దేహశుద్ధి

అమ్మాయిల ప్రేమను ఇష్టంగా కాకుండా బలవంతంగా పొందడం, లేకుంటే హతమార్చేందుకు సైతం సిద్దం కావడం ఇటీవల పెరిగిపోయింది. ఈ విధంగా ప్రేమించూ అంటూ వేధింపులకు గురి చేసిన యువకుడికి దేహశుద్ధి చేసి అమ్మాయి కుటుంబీకులు బుద్ది చెప్పారు.
 
వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా పరకాల మండలం కౌకుండలో ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడి ఇంటిపై యువతి కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి దాడి చేశారు. ఆ సమయంలో రెండు ఇళ్లకు నిప్పు పెట్టినట్లు సమాచారం. 
 
గత కొంతకాలంగా యువకుడు ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్నాడు. అయితే యువతి అందుకు నిరాకరించి, విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దాంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి పాల్పడ్డాడు. కాగా యువతి కుటుంబ సభ్యుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ యువకుడిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.