Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నిరుద్యోగ భృతి పథకం అమలు.. నెలకు రూ.5వేలు.. ట్రైనింగ్ ప్లస్ ఉద్యోగం కూడా..?

గురువారం, 18 మే 2017 (11:00 IST)

Widgets Magazine
Babu-nara lokesh

ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా ఏపీ సర్కారు అడుగులు వేస్తోంది. ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగ భృతి చెల్లించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించినట్లు తెలుస్తోదంది. ఇందులో భాగంగా నిరుద్యోగులకు భృతి చెల్లిస్తూనే, ఆ సమయంలో వివిధ కంపెనీల్లో శిక్షణ ఇప్పిస్తారు. శిక్షణ సమయంలో కంపెనీలు కూడా స్టైఫండ్‌ ఇస్తాయి. శిక్షణ పూర్తి కాగానే అదే కంపెనీలో ఉద్యోగం కూడా లభిస్తుందని ఏపీ సర్కారు వెల్లడించింది. 
 
ఉద్యోగం నుంచి వేతనం అందిన తర్వాత ప్రభుత్వం నిరుద్యోగ భృతిని నిలిపివేస్తుంది. స్థూలంగా ఇదీ ‘నిరుద్యోగ భృతి’ పథకం అమలు పద్ధతి. నిరుద్యోగ భృతికి సంబంధించిన విధి, విధానాల ఖరారుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో బుధవారం సమావేశమైంది. మంత్రులు నారా లోకేశ్‌, అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. 
 
తొలిసారి సమావేశమైన ఈ కమిటీ నిరుద్యోగ భృతికి సంబంధించిన పలు అంశాలపై చర్చించింది. ఈ పథకం అమలు సాధ్యాసాధ్యాలపై జూన్‌ 5న పారిశ్రామికవేత్తలు, కంపెనీలు, నిపుణులతో సమావేశమవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా.. వివిధ కంపెనీల్లో ఒప్పందం కుదుర్చుకుని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే ఒక వినూత్న పథకంపైనా సబ్‌ కమిటీలో చర్చ జరిగింది.
 
దీనిపై మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. నిరుద్యోగులను కంపెనీలలో శిక్షణ కోసం చేరుస్తామని, ఆ సమయంలో ప్రభుత్వం తరఫున నిరుద్యోగ భృతిగా నెలకు రూ.2 వేలు వారికి చెల్లిస్తామని, దీంతోపాటు కంపెనీ స్టైఫండ్‌గా రూ.3 వేలు ఇస్తుందన్నారు. శిక్షణ పూర్తవ్వగానే సదరు కంపెనీ ఆ నిరుద్యోగికి ఉద్యోగం కల్పించి పూర్తిస్థాయి జీతం ఇస్తుందని వివరించారు. ఎంతమందికి ఈ విధంగా చేయగలమనే అంశాన్ని పరిశీలించాలని సబ్‌ కమిటీలో నిర్ణయించినట్లు లోకేశ్‌ తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సామర్లకోట కుర్రాడు.. దిలీప్‌కు ఆపిల్‌లో ఉద్యోగం.. నెలకు రూ.2కోట్ల జీతం..

అమెరికాలో భారీ వేతనానికి సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఏపీకి చెందిన కుర్రాడు కొలువు ...

news

ట్రిపుల్ తలాక్ ఇస్లాం మతంలో అంతర్భాగం కాదు..

ట్రిపుల్ తలాక్ అంశం ఇస్లాం మతంలో అంతర్భాగం కాదని.. ఇది ఇస్లాం సమాజంలోని అంతర్గత సంఘర్షణ ...

news

బుల్లెట్ ట్రైన్‌‌తో పాటు పరుగెత్తిన ప్రయాణికుడు.. ఎందుకో తెలుసా? ఈ వీడియో చూడండి (Video)

ఓ ప్రయాణికుడు బతుకుజీవుడా అంటూ బుల్లెట్ ట్రైన్‌తో పాటు పరుగెత్తాడు. అదీ తన ప్రాణాలు ...

news

బెడ్రూముల్లో సీసీ కెమేరాలు.. భార్య, అత్త, మరదలి ఏకాంత దృశ్యాల చిత్రీకరణ... డబ్బు కావాలని శాడిస్ట్ భర్త టార్చర్

ఓ శాడిస్టు భర్త... తన భార్యను ఎన్ని విధాలుగా టార్చర్ పెట్టాలో అన్ని విధాలుగా పెట్టాడు. ...

Widgets Magazine