శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 31 జులై 2014 (16:16 IST)

ఆంధ్రప్రదేశ్‌లో 28 శాతం మేరకు పెరిగిన భూముల లావాదేవీలు!

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల లావాదేవీల వసూళ్లు 28 శాతం మేరకు పెరిగాయి. ఈ విషయాన్ని స్టాంపులు, రిజిస్ట్రేషన్లు శాఖకు వచ్చిన వసూళ్లు తేటతెల్లం చేస్తున్నాయి. 2014 జూన్ నెలలో ఈ శాఖకు మొత్తం 270.41 కోట్ల రూపాయల మేరకు వసూళ్లు కాగా, గత యేడాది అంటే 2013 జూన్ నెలలో ఈ వసూళ్లు రూ.185.81 కోట్లుగానే ఉంది. 
 
ప్రస్తుతం 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుంటూరు - విజయవాడలు జంట నగరాలు అయ్యే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతుండటంతో ఈ ప్రాంతంలో భూముల లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయ వసూళ్లు రూ.67.45 కోట్లు, రూ.53.93 కోట్లుగా ఉంది. 
 
ఇకపోతే తెలంగాణ విషయానికి వస్తే.. గత యేడాదితో పోల్చుకుంటే ఇక్కడ ఆదాయం తగ్గింది. 2014 జూన్ నెలలో మొత్తం వసూళ్లు రూ.200.45 కోట్లు కాగా, 2013 జూన్ నెలలో ఈ వసూళ్లు రూ.242.74 కోట్లుగా ఉంది. అయితే, రంగారెడ్డి, హైదరాబాద్‌లు అగ్రస్థానంలో ఉన్నాయి. 2014 జూన్ నెలలో హైదరాబాద్‌లో రూ.270 కోట్లు, రంగారెడ్డిలో రూ.115 కోట్లు చొప్పున వసూలయ్యాయి.