శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : బుధవారం, 4 మార్చి 2015 (12:09 IST)

భూసేకరణ చట్టంపై సమర శంఖం.. 1100 కి.మీ పాదయాత్రకు సిద్ధం..!

కేంద్రం ప్రతిపాదించిన భూసేకరణ చట్ట సవరణ బిల్లులోని రైతు వ్యతిరేక నిబంధనలపై సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే సమరశంఖం పూరించారు. ఈ నిబంధనలను ప్రభుత్వం ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. మహారాష్ట్రలోని వార్ధా నుంచి ఢిల్లీకి 1,100 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. దీనివలన దారిలోని అన్ని గ్రామాలను పట్టణాలను కలుపుకుంటే భూసేకరణ చట్టంపై ఒక అవగాహన వస్తుందనేది వారి భావన.
 
వార్ధాలోని గాంధీ ఆశ్రమం నుంచి మొదలయ్యే యాత్ర ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ముగుస్తుందన్నారు. ఈ యాత్రకు సుమారు 3 నెలల సమయం పడుతుందన్నారు. ఈ నెల 9న సేవాగ్రామ్‌లో జరిగే సమావేశంలో పాదయాత్ర షెడ్యూల్‌ను నిర్ణయిస్తామని చెప్పారు. మూడు నెలల పాదయాత్రతో దేశంలో ఇదే ప్రధాన చర్చనీయాంశం కానున్నది.