Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మరో దాచేపల్లి కారాదు... పాతగుంటూరు రేప్‌పై సీఎం సీరియస్

బుధవారం, 16 మే 2018 (11:09 IST)

Widgets Magazine

గుంటూరు జిల్లా దాచేపల్లిలో 8 యేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మరచిపోకముందే.. అదే గుంటూరు జిల్లాలోని పాత గుంటూరులో బాలికపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పోలీసులు సత్వరం స్పందించి నిందితుడిని అరెస్టు చేశారు.
chandrababu naidu
 
అయితే, బాధిత బాలిక కుటుంబ సభ్యులు యువకుడిని తమకు అప్పగించాలంటూ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీస్‌ స్టేషన్‌పై రాళ్ల దాడి చేయడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన ఐజీ, అర్బన్ ఎస్పీ ఆందోళనకారులతో చర్చలు జరిపారు. గుంటూరులో 144 సెక్షన్‌ను అమలు చేశారు.
 
ఇదిలావుంటే ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. పాతగుంటూరులో బాలికపై యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై సీఎస్‌, డీజీపీ, ఇంటెలిజెన్స్‌ అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆడపిల్లల జోలికి వచ్చేవారిని ఉపేక్షించవద్దని.. .నిందితులను కఠినంగా శిక్షించాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
అత్యాచారం పాత గుంటూరు చంద్రబాబు Guntur Rape Chandrababu గంటూరు Old Guntur

Loading comments ...

తెలుగు వార్తలు

news

లాంచీ ప్రమాద ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందన.. ఏమన్నారంటే...

గోదావరిలో లాంచీ మునిగిన సంఘటనలో గల్లంతైన వారి కోసం మొత్తం 20కి పైగా పడవలతో ముమ్మరంగా ...

news

కింగ్ మేకర్ కాదట.. కర్ణాటక కింగేనట ... తండ్రి బాటలో తనయుడు...

మాజీ ప్రధాని దేవెగౌడ తనయుడు కుమార స్వామి. ఈయన ఇపుడు కర్ణాటక రాజకీయాల్లో 'కింగ్ మేకర్'. ...

news

రంజుగామారిన కర్ణాటక రాజకీయం.. గవర్నర్‌ కోర్టులో బంతి

కర్ణాటక రాజకీయం రంజుగా మారింది. ప్రభుత్వ ఏర్పాటు బంతి ఇపుడు గవర్నర్ కోర్టులో పడింది. ...

news

దటీజ్.. ప్రియాంకా గాంధీ... చిన్నపాటి సలహాతో బీజేపీ ఆశలు గల్లంతు

కర్ణాటక ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడక ముందే యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ కుమార్తె ...

Widgets Magazine