ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: సోమవారం, 10 ఆగస్టు 2020 (14:18 IST)

తెదేపాకు మరో షాక్... నేడు వైసీపీ లోకి చలమశెట్టి సునీల్ ప్రవేశం

ఏపీలో టీడీపీకి మరో షాక్ తగలనుంది. ఆ పార్టీ నేత చలమశెట్టి సునీల్ నేడు వైసీపీలో చేరనున్నారు. సీఎం జగన్ సమక్షంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సునీల్ వైసీపీ కండువా కప్పుకోనున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన సునీల్ వైసీపీ అభ్యర్థి వంగా గీతా చేతిలో ఓడిపోయారు.
 
అప్పటి నుంచి ఆయన టీడీపీకి దూరంగా ఉంటున్నారు. 2022లో రాజ్యసభ ఖాళీ అవుతున్న ఓ ఎంపీ స్థానంలో సునీల్‌కు అవకాశం కల్పించడానికి అధికార పార్టీతో ఇటీవల మంతనాలు జరిగినట్లు సమాచారం. అయితో ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు వైసీపీ కండువాలను కప్పుకున్న విషయం తెలిసిందే. మరికొందరు కూడా అధికార పార్టీలోనికి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.