Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆంధ్రప్రదేశ్‌లో మరో 6 నీట్ పరీక్షా కేంద్రాలు... ఎక్కడెక్కడో తెలుసా?

మంగళవారం, 21 నవంబరు 2017 (15:01 IST)

Widgets Magazine
kamineni srinivas

అమరావతి : రాష్ట్రంలో కొత్తగా ఆరు నీట్ పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు కేంద్రాల్లో మాత్రమే నీట్ పరీక్షా కేంద్రాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో నీట్ పరీక్షా కేంద్రాలు పదికి చేరుకోనున్నాయి. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో మాత్రమే నీట్ పరీక్షా కేంద్రాలు ఉండటంతో, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దీనిని గుర్తించి, తక్షణమే రాష్ట్రంలో నీట్ పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచాలని ఇటీవల కేంద్రమంత్రి జేపీ నడ్డాను కోరినట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, కొత్తగా ఆరు పరీక్షా కేంద్రాలను పెంచడానికి అంగీకరించిందని తెలిపారు. 
 
పరీక్షా కేంద్రాల పెంపుదలతో రాష్ట్రంలో వైద్య విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. కొత్తగా మంజూరు చేసిన కేంద్రాలను విజయనగరం, రాజమండ్రి, కాకినాడ, చీరాల, నెల్లూరు, కర్నూలులో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వైజాగ్‌లో ఏలియన్ పక్షులు ఏం తింటున్నాయో తెలుసా?

వైజాగ్ వన్ టౌన్లో ఏలియన్ పక్షులు కనిపించాయని.. ఆ పక్షులకు సంబంధించిన ఫోటోలు సోషల్ ...

news

మార్స్‌పై ఫస్ట్ ల్యాండింగ్ టెస్ట్ సక్సెస్.. నాసా అద్భుతం...

మార్స్ (అరుణ గ్రహం)పై తొలి ప్యారాచ్యూట్ ల్యాండింగ్ పరీక్షను అమెరికా అంతరిక్ష పరిశోధనా ...

news

భారత్ దెబ్బకు తోకముడిచిన యూకే : అంతర్జాతీయ కోర్టులో విక్టరీ

భారత్ దెబ్బకు బ్రిటన్ తోకముడిచింది. ఫలితంగా అంతర్జాతీయ కోర్టులో దౌత్య విజయం సాధించింది. ...

news

విద్యార్థితో టీచర్ లైంగిక సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు..

మైనర్ విద్యార్థితో లైంగిక సంబంధం జరిపిన వివాహిత టీచర్‌ను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా ...

Widgets Magazine