శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : శనివారం, 18 ఫిబ్రవరి 2017 (12:15 IST)

చంద్రబాబు ఎందుకు సీరియస్ అవుతున్నారు!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల మీడియాపై బాగా మండిపడుతున్నారు. అయిన దానికీ కాని దానికి ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పత్రికా విలేకర్ల సమావేశాల్లో విలేకర్లు ఏమైనా ప్రశ్నలు అడిగితే నువ్వే పేప

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల మీడియాపై బాగా మండిపడుతున్నారు. అయిన దానికీ కాని దానికి ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పత్రికా విలేకర్ల సమావేశాల్లో విలేకర్లు ఏమైనా ప్రశ్నలు అడిగితే నువ్వే పేపర్, ఛానల్ అంటూ నిలదీయడం మీరు ఫలానా పార్టీకి చెందిన వారు కదా అలాగే మాట్లాడతారు. 
 
మీ జెండా ఎజెండా వేరుగా ఉంటాయి. అంటూ ఆయన ఉన్నట్లుండి సీరియస్ కావడం ఎవరికీ అర్థం కావడం లేదు. అంతకు ముందుతో పోలిస్తే చంద్రబాబునాయుడులో అసహనం పెరిగింది. తీరిగ్గా ఆలోచించే పరిస్థితులు తగ్గాయి. ఎవరి మీద పడితే వారిపైన ఆయన అకారణంగా ఆగ్రహిస్తున్నారు. దీంతో సహచర మంత్రులు, అధికారులు సైతం ఆయన దగ్గరకు వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఎవరిపై ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో అన్న ఆందోళన అందరిలోనూ ఉంది. దీంతో ఇప్పుడు ముఖ్యమంత్రికి సరైన సలహాలు, సూచనలూ ఇచ్చే వారూ లేకుండా పోతున్నారు. ఎవరు వెళ్ళి ఏమి మాట్లాడినా ఎలా ఉంటుందో అన్న భయం అందరినీ వేధిస్తోంది.
 
చంద్రబాబు అసహనం.. ఆగ్రహానికి కారణం ఏమిటి.. ఉన్నట్లుండి ఎందుకు ఆయన ఇలా సీరియస్ అవుతున్నారు. అంటే బాబు అనుకున్నవేమీ అవడం లేదు. అటు మంత్రివర్గంలోగానీ, ఇటు అధికారులు గాని ఆయన చెప్పిన మాట వినడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే ఇష్టారాజ్యంగానే వ్యవహరిస్తున్నారు. దీనికి కారణం ఏమంటే మళ్ళీ ఎన్నికల సమయం ఆసన్నం అవుతోంది. దీనికి పెద్ద మొత్తంలో నిధులు కావాలి. ఎలా సంపాదించుకోవాలి అన్నది వారి ప్రశ్నగా ఉంది. నిధులు లేకపోతే సీటు కూడా ఇవ్వరు. 
 
ఇప్పటికే పెట్టిన పెట్టుబడి తరువాత పెట్టాల్సిన ఖర్చు మొదలైనవి ఎవరు భరిస్తారు? అన్నది వారి ప్రశ్న. దీనికి చంద్రబాబు దగ్గర సమాధానం లేదు. అందుకే ఆయన ఏమి చెప్పినా పార్టీ యంత్రాగం మాత్రం వారి పనిలో వారు ఉన్నారు. గత ఎన్నికల ఖర్చును రాబట్టుకోవడం, రాబోయే ఎన్నికలకు సిద్థం కావడమే ఇప్పుడు వారి ముందున్న ఏకైక లక్ష్యంగా ఉంది. అధికారులది మరో వాదన హడావిడి నిర్ణయాలు. అనాలోచిత విధానాల వల్ల తరువాత తాము ఇబ్బందిపడతా మనే భయం అధికారుల్లో ఉంది. అందుకే అంత రిస్క్ ను తీసుకోలేమని తేల్చి చెప్పేస్తున్నారు. దీంతో చంద్రబాబు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. సమయం సంధర్భం లేకుండా మండిపడుతున్నారు.