బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 15 ఆగస్టు 2018 (13:17 IST)

నేనున్నాననీ... మీకేం కాదనీ....

నిస్సహాయక స్థితిలో వున్న రోగులకు నేనున్నానని భరోసా ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వివేక్ గుండె సంబంధిత సమస్యతో ప్రాణాపాయ స్థితిలో వున్నాడు. వైద్యం కోసం విజయవాడలోని డాక్టర్ రమేష్ ఆసుపత్రిలో చేరగా రూ. 3

నిస్సహాయక స్థితిలో వున్న రోగులకు నేనున్నానని భరోసా ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వివేక్ గుండె సంబంధిత సమస్యతో ప్రాణాపాయ స్థితిలో వున్నాడు. వైద్యం కోసం విజయవాడలోని డాక్టర్ రమేష్ ఆసుపత్రిలో చేరగా రూ. 3 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దినసరి కూలితో జీవనం సాగించే వివేక్ తల్లిదండ్రులు అంత మొత్తం భరించలేని స్థితిలో వున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉండవల్లి ప్రజావేదిక మంగళవారం కలిసి తమ పరిస్థితి వివరించారు. పిల్లవాడి పరిస్థితిని చూసిన సీఎం చలించిపోయారు. వెంటనే వివేక్ వైద్యానికయ్యే రూ. 3 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేశారు. 
 
అలాగే కడప జిల్లా లక్కిరెడ్డిపల్లికి చెందిన ఉప్పులూరి రామానుజమ్మ బోన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ వైద్యానికి డబ్బులు లేక ఇబ్బందిపడుతోంది. ఓవైపు పేదరికంతో మరోవైపు అనారోగ్యంతో ఆమె దీనావస్థలో వుంది. దీంతో మంగళవారం ఉండవల్లి ప్రజావేదిక వద్ద సీఎంని కలిసి రామానుజమ్మ తన పరిస్థితిని వివరించగా సీఎం వెంటనే స్పందించి ఆమె వైద్యానికి రూ. 2 లక్షలు ఆర్థిక సాయం అందించారు. 
 
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన విజయవాడకు చెందిన టి. రాజాకుమార్, టి. రజని కుమారిలు వారి అమ్మమ్మ గురవమ్మ దగ్గర పెరుగుతున్నారు. అమ్మమ్మకు వచ్చే వితంతు పింఛనుతో జీవనం సాగిస్తున్నారు. గురవమ్మ మనవడు, మనవరాలిని చదివించలేక నానా అవస్థలు పడుతోంది. ఎలాగైనా తన మనవడు, మనవరాలికి మంచి చదువులు చెప్పించి ప్రయోజకులు చేద్దామనుకుంటే ఆర్థిక స్థోమత లేక అర్థాంతరంగా చదువు మాన్పించే పరిస్థితి. ఈ సమయంలో తన గోడు చెప్పుకునేందుకు మంగళవారం నాడు సీఎం చంద్రబాబును కలిసి వివరించింది. దీంతో వెంటనే స్పందించిన సీఎం ఆమెకు రూ. 50 వేలు ఆర్థిక సాయం మంజూరు చేశారు.