నారావారి పల్లెలో భోగిమంటలు.. చంద్రబాటు ఇంట సందడేసందడి..

ఆదివారం, 14 జనవరి 2018 (11:46 IST)

babu - lokesh

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇంటే సంక్రాంతి సందడి అంతా నెలకొనివుంది. చంద్రబాబు దంపతులతో పాటు.. హీరో బాలకృష్ణ దంపతులు కూడా చిత్తూరు జిల్లా నారావారి పల్లెకు చేరుకుని భోగి మంటలు వేశారు. 
 
ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలసి తిరుమల చేరుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, హీరో బాలకృష్ణ దంపతులు, మంత్రి లోకేష్ దంపతులు తదితరులు తిరుమలకు వచ్చారు. 
 
కాగా, శనివారం సాయంత్రం నారావారి పల్లెకు వచ్చిన సీఎం రాత్రి అక్కడే బస చేశారు. ఆదివారం వేకువజామున భోగి మంటలు వేసిన చంద్రబాబు, బాలకృష్ణల ఫ్యామిలీ సభ్యులు భోగి నీళ్ళతో తలస్నానం చేసి అక్కడ నుంచి నేరుగా కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. 
 
సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు చంద్రబాబు, బాలకృష్ణ దంపతులు శనివారమే నారావారిపల్లెకు వెళ్లారు. అనంతరం ఆదివారం తెల్లవారుజామున జరిగిన భోగి వేడుకల్లో పాల్గొన్న అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి వెళ్లారు. కాగా... చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబాలకు టీటీడీ అధికారులు ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలికి, దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.దీనిపై మరింత చదవండి :  
Celebrates Naravari Palle Hero Balakrishna Bhogi Festival Ap Cm Chandrababu Naidu

Loading comments ...

తెలుగు వార్తలు

news

రూ.500 ఇస్తే చాలు.. మీరేమైనా చేసుకోవచ్చు.. రొమాన్స్ కేంద్రాలుగా పార్కులు

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ప్రధాన పార్కులు అసాంఘిక కార్యక్రమాలు అడ్డాలుగా మారాయి. ...

news

ఫోటో పిచ్చి... పరువు పోగొట్టుకున్న బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే (వీడియో)

ఫోటో పిచ్చితో బీజేపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే ఒకరు తమ పరువు పోగొట్టుకున్నారు. పత్రికల్లో ...

news

ఢిల్లీలో మానసిక వికలాంగురాలిపై గ్యాంగ్ రేప్

సీరియళ్లు, సినిమాల ప్రభావమో ఏమో తెలియదుకానీ, ఆడ పిల్లల మానప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేకుండా ...

news

ఒకటో తరగతి విద్యార్థినిపై ఐదో తరగతి బాలుర రేప్

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బులంద్‌షహర్‌లో దారుణం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి ...