Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మీరు ఆవేశపడొద్దు.. బీజేపీపై వ్యతిరేకత లేదు : ఎంపీల భేటీలో చంద్రబాబు

సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (08:49 IST)

Widgets Magazine
chandrababu naidu

కేంద్ర బడ్జెట్‌లో నవ్యాంధ్రకు జరిగిన అన్యాయంపై గళమెత్తేందుకు అధికార తెలుగుదేశం సిద్ధమవుతోంది. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఆదివారమిక్కడ జరిగిన టీడీపీపీ భేటీ జరిగింది. ఇందులో పలువురు ఎంపీలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. ఇప్పటివరకు బీజేపీ చేసింది చాలనీ, ఇక ఓ నమస్కారం పెట్టేసి మనదారి మనం చూసుకుందామనీ వారు సీఎంకు సూచన చేశారు. 
 
ముఖ్యంగా, జేసీ దివాకర్ రెడ్డి, అవంతి శ్రీనివాస్ వంటి వారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం సవతి తల్లి ప్రేమ పదర్శిస్తోందని, ఇక తాత్సారం చేయకుండా మంత్రి పదవులకు రాజీనామాలు చేసి కేంద్రానికి గుడ్‌బై చెబుదామని పిలుపునిచ్చారు. అలాగే, ఎంపీ పదవులకు రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్దామని అవంతి శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. 
 
దీంతో సీఎం చంద్రబాబు కల్పించుకుని వారికి అడ్డుకట్ట వేశారు. 'మనకు బీజేపీపై వ్యతిరేకత ఏదీ లేదు. రాష్ట్రానికి రావలసినవి రావడం లేదన్నదే మన ఆవేదన. అవి రాబట్టుకోవడానికి మనం అనేక మార్గాల్లో ప్రయత్నం చేస్తూనే ఉండాలి. తెగతెంపులు ఒక్క నిమిషం పని. కానీ మనది కొత్త రాష్ట్రం. మౌలికవసతులు అభివృద్ధి చేసుకోవాలి. పరిశ్రమలు తెచ్చుకోవాలి. తెంచుకోవడం ద్వారా కాకుండా ఒత్తిడి పెంచడం ద్వారా వాటిని సాధించుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్లు స్పందించకపోతే ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దామన్నారు. 
 
అలాగే, ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నప్పుడు అనేక అంశాల్లో మనపై ఒత్తిళ్లు ఉంటాయి. విభజన సమయంలో రెండు రాష్ట్రాల్లో రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఏదో ఒక వైపు మొగ్గాలని నాపై చాలా మంది ఒత్తిడి తెచ్చారు. రెండు రాష్ట్రాలకు న్యాయం జరిగేలా విభజన చేయాలని డిమాండ్‌ చేశాను. ప్రజలు దానిని ఆమోదించారు. ఒక రాష్ట్రంలో అధికారం ఇచ్చారు. మరో చోట బీజేపీతో కలిపి ఇరవై సీట్లు ఇచ్చారు. నాకు మీ అందరి కంటే ఎక్కువ ఆవేశం ఉంది. నేనొకసారి యుద్ధం మొదలుపెడితే నన్ను ఆపగలిగేవారు ఎవరూ లేరు. కానీ రాష్ట్రం, ప్రజల అవసరాలు చూసి బాధ్యతాయుతంగా నిర్ణయం తీసుకోవాలి అంటూ హితవు పలికారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

70 కిలోమీటర్ల మేర మృతదేహాన్ని లాక్కెళ్లిన బస్సు డ్రైవర్.. అరెస్ట్

కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ)కు చెందిన ఓ బస్సు డ్రైవర్ మృతదేహాన్ని 70 ...

news

చంద్రయాన్-2 ప్రయోగానికి ఇస్రో సిద్ధం- 2018 ప్రథమార్థంలో?

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-2 కోసం సమాయత్తమవుతోంది. తద్వారా రెండోసారి ...

news

మిత్రపక్షం అధికారంలో వుండి ఇంత నిర్లక్ష్యమా.. కుంటిసాకులా?: మంత్రి గంటా

తెలుగుదేశం పార్టీ బీజేపీతో కటీఫ్‌ చేసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేంద్ర ...

news

చంద్రబాబుకు ఉద్ధవ్ థాక్రే ఫోన్- బీజేపీతో కటీఫ్ చేస్కోండి

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే ఫోనులో మాట్లాడారు. ఇటీవల ...

Widgets Magazine