Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తెలుగోడిని రెచ్చగొట్టొద్దు.. మాడి మసైపోతారు : చంద్రబాబు వార్నింగ్

శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (11:41 IST)

Widgets Magazine
chandrababu naidu

తెలుగోడి ఆత్మగౌరవాన్ని కించపరిచి రెచ్చగొడితే మాడి మసైపోతారంటూ ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పాలకులను హెచ్చరించారు. 'రాష్ట్రంలో కొన్ని పార్టీలున్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వాలని వాటి నేతలు కేంద్రాన్ని అడగరు. నన్ను తిడతారు.. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియకుండా.. నన్ను తిడితే ఓట్లు పడతాయన్న ఆశతో నిద్ర లేచినప్పటి నుంచి నన్ను తిట్టడమే వాళ్ల పని' అంటూ మండిపడ్డారు. 
 
అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం యర్రమంచి వద్ద గురువారం ఆయన కియ కార్ల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, రాష్ట్రంలో కొన్ని పార్టీలున్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని అడుగరు. నన్ను తిడతారు. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియకుండా.. నన్ను తిడితే వీళ్లకు ఓట్లు పడతాయని.. నిద్ర లేచినప్పటి నుంచి నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. రాష్ట్రంల ఓ ఓ పేపర్‌ ఉంది. దాని పేరు చెప్పనుగానీ, అదేంటో మీకే బాగా తెలుసు. అసత్యాలు రాసీ రాసీ అలిసిపోతున్నారు. ఏమైనా లాభం ఉంటుందా తమ్ముళ్లూ అని మిమ్మల్ని అడుగుతున్నాను అని వ్యాఖ్యానించారు. 
 
రాష్ట్ర విభజన అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో క్లిష్ట సమయంలో తానైతే తప్ప మరొకరు కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేరని ప్రజలు తనపై నమ్మకంతో అధికారమిచ్చారని, ఈ విషయాన్ని తాను ఎన్నటికీ మరిచిపోలేనని చెప్పారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమన్నారు. ఇకపై ఎవరికీ ఇవ్వబోమన్నారు. మనకు ప్రత్యేక సాయం చేస్తామని చెప్పారు. హోదాకు సమానంగా ప్రతిఫలం ఇస్తామన్నారు. కానీ ఏమీ ఇవ్వలేదు. పైగా ఇప్పుడు వేరే రాష్ట్రాలకు హోదా పొడిగిస్తున్నారు. మరి మనకెందుకు ఇవ్వరు? ఇవ్వాల్సినవన్నీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం. 
 
విభజన హామీలను, ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయాలని కోరుతూ తాను ఢిల్లీకి 29 సార్లు వెళ్లి చర్చించానని గుర్తుచేశారు. కేంద్రం హామీ ఇచ్చిన ప్రకారం సహకరించి ఉంటే.. రెవెన్యూలోటు భర్తీ, ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే రాష్ట్రం ఇప్పుడు ఇంకా అభివృద్ధి చెంది ఉండేదన్నారు. అయినా సరే తన ప్రయత్నాలతో రాష్ట్రానికి కియ లాంటి భారీ పరిశ్రమలను తీసుకొచ్చానని చెప్పారు. 2014 నాటికంటే మన పరిస్థితి మెరుగుపడిందని.. ఇందుకు తాను రేయింబవళ్లు కష్టపడుతుండడం, అధికారులు, ప్రజలు సహకరిస్తుండడమే కారణమన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కొత్త జంటల కాపురాలను కూలుస్తున్న రెస్టారెంట్... ఎలాగో తెలిస్తే షాక్..?

ఒక్కోసారి అనుకోని పరిస్థితుల్లో పెళ్ళయినా సరే రెండో వివాహం చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి ...

news

అందరూ చూస్తుండగా.. వెనక నుంచి వచ్చి యువతికి ముద్దెట్టాడు..

అందరూ చూస్తుండగా.. ముంబై రైల్వే స్టేషన్‌లో ఓ యువతిని పబ్లిక్‌గా ముద్దు పెట్టేశాడు.. ఓ ...

news

లైంగిక కోరిక తీర్చకుంటే కాళ్లు నరికేస్తా.. స్పా సెంటర్ ఉద్యోగిని వార్నింగ్

లైంగిక కోరిక తీర్చకుంటే కాళ్లు నరికేస్తానంటూ ఓ స్పా సెంటర్ ఉద్యోగిని ఓ వ్యక్తి వార్నింగ్ ...

news

లారీ ఢీకొట్టడంతో ఎగిరిపడ్డాడు.. అయినా ఏం కాలేదు

గుజరాత్‌లో ఒళ్లు గగుర్పాటు కలిగే సంఘటన చోటుచేసుకుంది. గుజరాత్‌లో ఓ వ్యక్తి రోడ్డు ...

Widgets Magazine