శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 6 జూన్ 2018 (14:02 IST)

అదే జరిగితే ఉరివేసుకుంటా : ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి

భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నా పెట్టుకుంటుందంటూ విపక్ష నేతలు చేస్తున్న ప్రచారంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందించారు.

భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నా పెట్టుకుంటుందంటూ విపక్ష నేతలు చేస్తున్న ప్రచారంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందించారు. ఇదే అంశంపై ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు. ఒకవేళ అదే జరిగితే నేను ఉరి వేసుకోవడానికి సిద్ధం.. ఇది నా వ్యక్తిగతం కాదు.. పార్టీ తరపునే చెప్తున్నా అని వ్యాఖ్యానించారు.
 
అంతేకాకుండా, జిల్లాలో బీసీలపై కేఈ కుటుంబ పెత్తనమేమీ లేదు. ప్రజల ఆదరణతోనే నేను రాజకీయంగా ఎదిగాను. ధైర్యం ఉంటే నాతో, నా కుటుంబంతో పోటీ చేసి గెలవాలి. నాపై వ్యక్తిగత దూషణలకు దిగడం మానాలని ఆయన హితవు పలికారు. 
 
బీజేపీతో వైసీపీ కుమ్మక్కై రాజీనామాల వ్యవహారాన్ని నాన్చుతున్నారని ఆరోపించారు. బీజేపీ పంచన చేరిన వైసీపీకి 2019లో పుట్టగతులు ఉండవని కేఈ అన్నారు. బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకుని కుప్పిగంతులు వేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీని విమర్శించాలని జగన్, పవన్‌ పనిగా పెట్టుకున్నారని అన్నారు.