శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (10:55 IST)

ప్రమాణ స్వీకార తేదీని దేవుడు నిర్ణయిస్తాడు: వైఎస్. జగన్

తన ప్రమాణ స్వీకార తేదీని దేవుడే నిర్ణయిస్తాని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత గురువారం రాత్రి జగన్ మీడియాతో మాట్లాడుతూ, దేవుడి ద
య, ప్రజల దీవెనలతో వైసీపీకి విజయం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 
 
టీడీపీ నేతలు ఎన్ని అరాచకాలు, హింసాత్మక చర్యలకు పాల్పడినప్పటికీ.. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు, ఓటర్లు ధైర్యంగా వాటిని ఎదుర్కొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. వారికి ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. 
 
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దిగజార్చుతూ ఈసీని బెదిరించారని ఆరోపించారు. చంద్రబాబు చేసిన కుట్రలు, డ్రామాలు అన్నింటినీ దాటుకుని ఓటు వేసిన ప్రజలకు కృతఙ్ఞతలు చెబుతున్నానని అన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనడం తమకు అనుకూలమని, ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని, రాష్ట్రంలో రాక్షస పాలనకు ప్రజలు చరమ గీతం పాడారని జగన్ జోస్యం చెప్పారు. 
 
ఒక వ్యక్తి ఓడిపోతున్నాడని తెలిసి, తనను తాను కాపాడుకోవడానికి ఏ రకంగా వ్యవహరించారో చూస్తుంటే చాలా బాధవుతోంది. చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం టి.సొదుంలో టీడీపీ నాయకుల దాడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త వెంకటరమణరెడ్డి చనిపోయారు. గొడవల్లో కొంతమంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా అంటూ జగన్ వ్యాఖ్యానించారు.