శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 10 జూన్ 2017 (11:54 IST)

చెవిరెడ్డీ! నాలుక కోస్తాం.. అదుపులో పెట్టుకో: ఉద్యోగ సంఘాల వార్నింగ్

చంద్రగిరి అసెంబ్లీ వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా పదేపదే వ్యాఖ్యలు చేస్తున్న చెవిరెడ్డి వ

చంద్రగిరి అసెంబ్లీ వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా పదేపదే వ్యాఖ్యలు చేస్తున్న చెవిరెడ్డి వైఖరి సరైంది కాదని వారు మండిపడ్డారు. అధికారంలోకి వస్తే తమకి వ్యతిరేకంగా ఉన్న అధికారులను వెంటాడి, జైల్లో పెట్టిస్తామంటూ చెవిరెడ్డి వ్యాఖ్యానించడం ఉద్యోగుల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. చెవిరెడ్డి ఇలాంటి హెచ్చరికలు చేయడం ఇదే మొదటిసారి కాదని... గతంలో కూడా ఇలాంటి హెచ్చరికలే జారీ చేశారని మండిపడ్డారు.
 
ఉద్యోగులతో పెట్టుకున్న ప్రజాప్రతినిధులు కానీ, పార్టీలు కానీ, సంస్థలు కాని మనుగడ సాగించలేకపోయాయనే విషయాన్ని చెవిరెడ్డి గుర్తు పెట్టుకోవాలని ఆ సంఘాల ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు. తమకు పార్టీలతో సంబంధం లేదని... ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ ప్రభుత్వ సూచనలకు, నిబంధనలకు అనుగుణంగా పని చేస్తామని తెలిపారు. ఉద్యోగులతో పెట్టుకుంటే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయంటూ ఉద్యోగ సంఘాల నేతలు వార్నింగ్ ఇచ్చారు.
 
వైఎస్.రాజశేఖర్ రెడ్డి, కె.రోశయ్య, ఎన్.కిరణ్ కుమార్ రెడ్డిల హయాంలో అప్పటి ప్రభుత్వ నిబంధనల మేరకు అధికారులంతా పని చేశారనే విషయాన్ని చెవిరెడ్డి గుర్తుపెట్టుకోవాలని సూచించారు. రేపు వైసీపీ ప్రభుత్వం వచ్చినా... ఆ ప్రభుత్వ సూచనల మేరకే పని చేస్తామని చెప్పారు. రాజకీయాలను పార్టీల వరకే పరిమితం చేసుకోవాలని... రాజకీయాల్లోకి ఉద్యోగులను లాగే ప్రయత్నం చేస్తే, చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఉద్యోగుల గురించి మాట్లాడేటప్పుడు నాలుకను అదుపులో పెట్టుకోవాలని లేనిపక్షంలో నాలుక కోస్తామని హెచ్చరించారు.