శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 26 మార్చి 2018 (13:13 IST)

థర్డ్ ఫ్రంట్‌పై పవన్ కన్నేశారా? వామపక్షాలతో భేటీ.. భద్రత పెంపు..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో లెఫ్ట్ పార్టీ నేతలు భేటీ అయ్యారు. ప్రత్యేక హోదాపై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. హైదరాబాదులోని జనసేన పార్టీ కార్యాలయానికి చేరిన సీపీఎం, సీపీఐ నేతలు.. జనసేన పార్టీ భవిష్యత

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో లెఫ్ట్ పార్టీ నేతలు భేటీ అయ్యారు. ప్రత్యేక హోదాపై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. హైదరాబాదులోని జనసేన పార్టీ కార్యాలయానికి చేరిన సీపీఎం, సీపీఐ నేతలు.. జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు దేశంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తృతీయ కూటమిని ప్రారంభించే దిశగా పవన్ ఉన్నారని.. ఈ విషయమై.. వామపక్షాలతో కూడిన ఆయన చర్చించారని ప్రచారం సాగుతోంది. థర్డ్ ఫ్రంట్‌పై జాతీయ నేతల వద్ద ప్రస్తావించి సిద్ధాంతాల పరంగా ఒకే భావజాలమున్న పార్టీలను ఏకం చేసే బాధ్యతలను సీపీఐ, సీపీఎం పార్టీలకే అప్పగించే దిశగా పవన్ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఇదిలా ఉంటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ సర్కారు భద్రత పెంచింది. ఇకపై సాయుధులైన ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది ఆయన వెంట అనుక్షణం వుండేలా చర్యలు తీసుకుంది. ఇందులో భఆగంగా  '2 ప్లస్ 2' విధానంలో నలుగురు సిబ్బందిని కేటాయిస్తూ, ప్రభుత్వం ఆదేశాలు వెలువరించింది.
 
ఇటీవల గుంటూరులో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగిన వేళ, తనకు సెక్యూరిటీ కావాలని డీజీపీని పవన్ కల్యాణ్ కోరిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన పోలీసు శాఖ నలుగురు గన్ మెన్లను రెండు షిప్టుల్లో కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులు వెలువరించింది.