హరికృష్ణ మరణం.. బోసిపోయిన అఖిల ప్రియ వివాహ మండపం..

ఆంధ్రప్రదేశ్ మంత్రి అఖిల ప్రియ భార్గవ రామ్‌ల పెళ్లి వేడుకలు ఘనంగా ముగిసాయి. వీరి వివాహం కోటకందుకూరు మెట్ట వద్ద గల భూమా శోభానాగిరెడ్డి మెమోరియల్ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగింది. పెళ్లికి తెలుగు రాష్ట్రాల

selvi| Last Updated: గురువారం, 30 ఆగస్టు 2018 (16:11 IST)
ఆంధ్రప్రదేశ్ మంత్రి భార్గవ రామ్‌ల పెళ్లి వేడుకలు ఘనంగా ముగిసాయి. వీరి వివాహం కోటకందుకూరు మెట్ట వద్ద గల భూమా శోభానాగిరెడ్డి మెమోరియల్ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగింది. పెళ్లికి తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 50వేల మంది హాజరు కావొచ్చని అంచనా వేశారు. కానీ అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మరణించడంతో పలువురు ప్రముఖులు, నేతలు హైదరాబాద్ తరలి వెళ్లారు. 
 
గవర్నన్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇంకా పలువురు హాజరు కావాల్సి ఉండగా నందమూరి హరికృష్ణ మృతి నేపథ్యంలో వారంతా హైదరాబాద్ రావాల్సి వచ్చింది. దాదాపు 5వేలమంది వీఐపీలు ఒక్కసారే కూర్చోగల సామర్థ్యం ఉన్న కళ్యాణ మండపం పలువురి గైర్హాజరు అవడంతో కొద్దిగా బోసి పోయింది. 
 
అయితే సాధారణ ప్రజలు, బంధు మిత్రులు భారీగా హాజరవడంతో పెళ్లి తంతు ఘనంగా ముగిసింది. బుధవారం ఉదయం 10.57 నిమిషాలకు అఖిలప్రియ వివాహం జరిగింది. అందుకు కొన్ని గంటల ముందే నందమూరి హరికృష్ణ చనిపోయారు. దీంతో వీఐపీల షెడ్యూల్ మారింది. దీనిపై మరింత చదవండి :