శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (20:49 IST)

3,323 డీలర్ల పోస్టుల భర్తీ... వేలి ముద్రలు పడకపోయినా సరుకులివ్వండి... మంత్రి పత్తిపాటి

అమరావతి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3,323 డీలర్ల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ నెలలోనే రాష్ట్రంలో ఉన్న అన్ని ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా ఈ పోస్ ద్వారా డీలర్లకు బియ్యం పంపిణీ చేయనున్నట

అమరావతి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3,323 డీలర్ల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ నెలలోనే రాష్ట్రంలో ఉన్న అన్ని ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా ఈ పోస్ ద్వారా డీలర్లకు బియ్యం పంపిణీ చేయనున్నట్ల వెల్లడించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో సివిల్ సప్లయ్ శాఖాధికారులతో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రేషన్ షాపుల ద్వారా సరకుల పంపిణీలో ఎటువంటి అక్రమాలకూ తావివ్వకూడదని అధికారులను మంత్రి ఆదేశించారు. 
 
ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా బియ్యం పంపిణీలో అవకతవల నివారణకు ఇకపై ఈ పోస్ ద్వారా పంపిణీ చేయాలన్నారు. ఇప్పటికే తూర్పుగోదావరిలో ప్రయోగాత్మకంగా ఈపోస్ ద్వారా బియ్యం పంపిణీ చేశామని, సత్ఫలితాలు వచ్చాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇదే విధానం ఈ నెల 15 తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. రేషన్ షాపుల సమయపాలన, సరకుల పంపిణీలోనూ ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతపై మంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 3,323 డీలర్ల పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 
 
5 కేజీల గ్యాస్ సిలిండర్ కు బదులు 14.2 కేజీల సిలిండర్ పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారని మంత్రి దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. ప్రజల కోరిక మేరకు 14.2 కేజీల సిలిండర్ల పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. మన్యంలో నివాసముంటున్న ఎస్సీలకు కూడా దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో విలేజ్ మాల్స్ ఏర్పాట్లపై తీసుకున్న చర్యలపై అధికారులతో మంత్రి చర్చించారు.
 
రేషన్‌ డిపోల్లో వేలి ముద్రలు, ఐరిష్‌ పడని వారికి సరుకులు ఇవ్వాలని అధికారుకు ఆదేశించారు. వాల్ మార్ట్, ఫీచర్ గ్రూప్, రిలయన్స్ సంస్థలు విలేజ్ మాల్స్ ఏర్పాటుపై ఆసక్తి చూపతున్నాయని మంత్రికి అధికారులు తెలిపారు. వాల్ మార్ట్ 3 జిల్లాలు, ఫీచర్ గ్రూప్ 4, మిగిలిన జిల్లాల్లో విలేజ్ మాల్స్ నిర్వహణకు రిలయన్స్ బిడ్లు దాఖలు చేశాయన్నారు. రిలియన్స్ సంస్థతో విజయవాడ, గుంటూరులో ప్రయోగాత్మకంగా విలేజ్ మాల్స్ ను ఏర్పాటు చేసేలా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు. 
 
27 వేల నాలుగు చక్రాల వాహన యజమానులతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కార్డులకు సరకులు అందజేస్తున్నట్లు మంత్రికి అధికారులు తెలిపారు. ధాన్యం సేకరణలో ప్రస్తుతం ఉన్న లోపాలను సవరించి, కొత్త విధానాలను రూపొందించాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశించారు. మిలర్లతో సమావేశాలు ఏర్పాటు చేయాలని, రైస్ మిల్స్‌లో ఆకస్మిక పర్యటనలు చేపట్టాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. సెలెక్ట్ చానల్ పేరుతో మాల్స్, థియేటర్లలో ఒకేరకమైన ఉత్పత్తులపై వేర్వేరు ధరలతో విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కేసులు కూడా నమోదు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.