శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 జులై 2015 (11:08 IST)

కలాం హెయిర్ స్టైల్‌కు కారణం ఏంటో తెలుసా? తరచూ దువ్వుకోవడం..?

శాస్త్రవేత్త, మేధావి అబ్ధుల్ కలాం దివికేగారు. చిన్న పిల్లలను తలపించే కల్మషం లేని నవ్వు ఆయన సొంతం. స్ఫూరిప్రదాత అయిన అబ్ధుల్ సోమవారం కన్నుమూశారు. రామేశ్వరంలో బుధవారం అంత్యక్రియలు జరుగనున్న నేపథ్యంలో.. ఆయన జీవిత విశేషాలపై పలు కథనాలు వస్తున్నాయి. ఇదే తరహాలో  హెయిర్ స్టైల్‌పై కూడా పెద్దగా చర్చ సాగుతోంది.
 
అబ్ధుల్ కలాం హెయిర్ స్టైల్ వెనుక పెద్ద కథే ఉందట. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఉన్న సొంత ఊరిలో ఆయన పూర్వీకులంతా ఇలాగే కొంత పొడవైన జుట్టును పెంచుకునేవారట. అదే విధానాన్ని కలాం కూడా కొనసాగించారు. జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ, ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నప్పుడు కూడా ఆయన తన హెయిర్ స్టైల్‌ను మార్చుకోలేదు. ఢిల్లీలో హబీబ్ కుటుంబీకులు నిర్వహిస్తున్న సెలూన్‌లో కలాం హెయిర్ కటింగ్ చేయించుకునేవారు. ఇందుకుగాను కలాం నుంచి వారు రూ. 500 తీసుకునేవారని తెలిసింది. 
 
మరో విషయం ఏమిటంటే, ఆయనకు తన హెయిర్ స్టైల్ అంటే చాలా ఇష్టం. దాన్ని స్టైల్‌గా ఉంచుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. తరచూ తన తలను దువ్వుకోవడం ఆయనకు అలవాటు. పెద్ద పెద్ద సెమినార్లలో సైతం తన జుట్టును చేత్తో పైకి దువ్వుతూ ప్రసంగించడం ఆయన స్టైల్ అని సన్నిహితులు అంటున్నారు.