శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 17 ఏప్రియల్ 2016 (14:41 IST)

ఇచ్చిన నిధులు ఖర్చు చేస్తే.. కొత్తగా నిధులు మంజూరు : బండారు

రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మండిపడ్డారు. ఇచ్చిన నిధులను ఖర్చు చేయకుండా కొత్తగా నిధులు ఇవ్వమంటే ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. అదేసమయంలో కరవుతో అల్లాడుతున్న ప్రాంతాలను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. 
 
ఇదే అంశంపై ఆయన ఆదివారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాల సహకారం అందించేందకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఇటీవల తాను ఖమ్మం, మెదక్‌, కరీంనగర్‌ జిల్లాల్లోని 3 గ్రామాల్లో పర్యటించానని, రైతన్నల సమస్య చాలా క్లిష్టంగా ఉందన్నారు. కరవుతో విలవిల్లాడుతున్నారని, తాగునీరు లేక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని, పశుగ్రాసం దొరకడం లేదన్నారు. 
 
30 శాతం పంటనష్టం జరిగినా పరిహారం వర్తింపజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అకాల వర్షాల కారణంగా గత ఖరీఫ్‌లో రూ.2,608 కోట్ల మేర పంట నష్టం జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి నివేదికలు అందాయన్నారు. అందులో రూ.792 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద కేంద్రం విడుదల చేసిందన్నారు. కరవు నివారణ చర్యల నిమిత్తం కేంద్రం రూ.318 కోట్లు రాష్ట్రానికి ఇచ్చిందని, వాటిని ఇంకా ఖర్చు చేయలేదని ఆయన గుర్తు చేశారు.