Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కేసీఆర్.. ఓ దద్దమ్మ : బండారు దత్తాత్రేయ

శుక్రవారం, 2 మార్చి 2018 (11:41 IST)

Widgets Magazine
bandaru dattatreya

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఓ దద్దమ్మ అంటూ దత్తాత్రేయ ధ్వజమెత్తారు. ఇటీవల కేసీఆర్ ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తూ, రూ.లక్షన్నర కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.10 వేల కోట్లు కూడా కేటాయించలేని దద్దమ్మలు కేంద్ర ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తారా? అంటూ విరుచుకుపడ్డారు. 
 
ఈ వ్యాఖ్యలపై బండారు దత్తాత్రేయ స్పందించారు. దేశంలో రైతన్నల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని... అలాంటి బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీతో పోలుస్తారా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రం నుంచి మంత్రులు ఎవరైనా సరే ఢిల్లీ వెళ్తే... కేంద్ర మంత్రులు వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నారని ఆయన గుర్తుచేశారు.
 
ప్రధానిగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాకే దేశంలో రైతులు పచ్చగా ఉన్నారనీ తెలిపారు. రైతుల సంక్షేమం గురించి ఆలోచన చేసే ఏకైక ప్రభుత్వం బీజేపీ సర్కారు అని బండారు చెప్పుకొచ్చారు. అదేసమయంలో తెలంగాణ రాష్ట్రంలోని రైతుల పరిస్థితి ఎలా ఉందో ఓ సారి తెలుసుకోవాలని సీఎం కేసీఆర్‌కు సూచించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నీతి కలిగిన టీడీపీ భ్రష్టుపట్టిపోయింది... నాయకత్వ లోపం : మోత్కుపల్లి

నీతి కలిగిన తెలుగుదేశం పార్టీ భ్రష్టుపట్టిపోయిందంటూ ఆ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత ...

news

మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో... 29న జీఎస్ఎల్వీ-ఎఫ్08

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 29వ తేదీన ...

news

శృంగారానికి నిరాకరించిందనీ ప్రియురాలి కుమారుడిని చంపేశాడు...

ఓ కామాంధుడు దారుణానికి పాల్పడ్డాడు. తనతో కొనసాగిస్తూ వచ్చిన వివాహేతర సంబంధానికి ...

news

మోడీ - షా ద్వయం ఉచ్చులో చంద్రబాబు : జేసీ దివాకర్ రెడ్డి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఉచ్చులో టీడీపీ అధినేత, ఏపీ ...

Widgets Magazine