శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2016 (12:32 IST)

తిరుపతిలో బంద్... తిరుమలలో శ్రీవారి భక్తుల అవస్థలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు చేపట్టిన బంద్‌తో పాటు.. నేతలు చేస్తున్న ఆందోళనతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు చేపట్టిన బంద్‌తో పాటు.. నేతలు చేస్తున్న ఆందోళనతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డిపోలో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగుపయమవుతున్న భక్తులు బస్సులు లేక బస్టాండ్‌లోనే పడిగాపులు కాస్తున్నారు. ప్రైవేటు వాహనాలను కూడా తిరగడం లేదు. షాపులన్నీంటినీ మూసివేశారు. బంద్‌ కారణంగా తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య కూడా తగ్గిపోయింది.
 
బంద్‌ ప్రభావం తిరుమలపై పడిందని స్పష్టంగా చెప్పవచ్చు. కంపార్టుమెంట్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. సర్వదర్శనంతో పాటు కాలినడకన దర్శనానికి వెళ్లే భక్తులు కంపార్టుమెంటులోకి వెళ్లకుండా నేరుగా క్యూలైన్‌ ద్వారా శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నారు. గంటలోనే శ్రీవారి దర్శనం భక్తులకు లభిస్తోంది.