ఇక టిడిపి.. జనసేన ఒకే పార్టీలానా.. ఎలా?

minister botsa
జె| Last Modified మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (18:26 IST)
రాజధానిని మార్చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్సలు చేస్తున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ విమర్సలు చేస్తుంటే.. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విమర్సల వర్షం కురిపిస్తున్నారు. జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ విమర్సలు తారాస్థాయికి చేరుకుంది.

దీంతో వైసిపి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ పైన గురిపెట్టింది. ఏకంగా పవన్ కళ్యాణ్ పైన తీవ్రస్థాయిలో విమర్సలు చేస్తున్నారు వైసిపి నేతలు. టిడిపికి ఏజెంట్‌గా పవన్ కళ్యాణ్ మారిపోయారని, చంద్రబాబు మాట్లాడకుండా ఉంటే పవన్ కళ్యాణ్ గొంతు పైకి లేస్తోందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. పవన్ కళ్యాణ్ మాట్లాడే తీరు చూస్తే టిడిపితో కలిసిపోయినట్లు అనిపిస్తోందంటూ ఎద్దేవా చేశారు బొత్స సత్యనారాయణ.

అయితే పవన్ కళ్యాణ్ మాత్రం బొత్స వ్యాఖ్యలపై స్పందించలేదు. టిడిపి నేతలు కూడా ఖండించలేదు. దీంతో రెండు పార్టీలు కలిసి వైసిపి ప్రభుత్వంపై పోరాడే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.దీనిపై మరింత చదవండి :