శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 27 జనవరి 2015 (18:30 IST)

ఫేస్ బుక్ గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తే చితకబాదారు.!

ఫేస్ బుక్ క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా ఫేస్ బుక్‌లో పరిచయం అయిన అమ్మాయిని కలుద్దామని వెళితే.. ఆ అమ్మాయి బంధువులు వచ్చి చితక్కొట్టిన ఘటన విజయవాడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కృష్ణాజిల్లా గొల్లపూడికి చెందిన శివ దుర్గాశ్రీనివాస్ గత కొంతకాలంగా ఓ యువతితో చాటింగ్ చేస్తున్నాడు. 
 
వీరిద్దరూ మంగళవారం విజయవాడ క్లబ్ సమీపంలోని 'ఎడ్వంచర్' వద్ద కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. శ్రీనివాస్ అక్కడికి వెళ్లి వేచి చూస్తుండగా, యువతి బంధువులుగా భావిస్తున్న కొందరు వ్యక్తులు వచ్చి అతడిని సమీప పొలాల్లోకి తీసుకువెళ్ళారు.
 
అక్కడ అతడిని చితకబాది పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు తెలిపారు.