శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: శనివారం, 28 మే 2016 (13:32 IST)

చెక్కిలిపై చెక్కిలి పెట్టి... వామ్మో! ఇదేం చెకింగ్...

రాత్రిళ్ళు రోడ్ల‌పై పోలీసులు ఆపి బండ్లు చెకింగ్ చేయ‌డం స‌ర్వ‌సాధార‌ణం. అదే డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ అయితే, పోలీసులు బ్రీత్ అన‌లైజ‌ర్ ఉప‌యోగిస్తారు. పైప్ నోట్లో పెట్టి ఊద‌మంటారు. ఆల్క‌హాల్ తాగినవారు ఎంత మోతాదులో తాగితే, అంత మీట‌ర్ తిరుగుతుంది. దాన్న

రాత్రిళ్ళు రోడ్ల‌పై పోలీసులు ఆపి బండ్లు చెకింగ్ చేయ‌డం స‌ర్వ‌సాధార‌ణం. అదే డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ అయితే, పోలీసులు బ్రీత్ అన‌లైజ‌ర్ ఉప‌యోగిస్తారు. పైప్ నోట్లో పెట్టి ఊద‌మంటారు. ఆల్క‌హాల్ తాగినవారు ఎంత మోతాదులో తాగితే, అంత మీట‌ర్ తిరుగుతుంది. దాన్నిబ‌ట్టి ఆల్క‌హాల్ తాగి డ్రైవింగ్ చేస్తున్నార‌ని పోలీసులు కేసులు పెడుతుంటారు. కానీ, బీహార్‌లో పోలీసుల తీరు మ‌రీ విచిత్రం. అక్క‌డ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ అంటే, ఎటువంటి బ్రీత్ అన‌లైజ‌ర్లు, మీట‌ర్లు ఉండ‌వు.
 
రోడ్డుపై బండి ఆపి, కానిస్టేబుళ్లు ఇలా నోటి ద‌గ్గ‌ర ముక్కు పెట్టి వాస‌న చూస్తున్నారు. చెక్కిలిపై చెక్కిలి ఆనిచ్చి... ముక్కు ఎగ‌ పీలుస్తున్నారు. వాస‌న వ‌చ్చింది నాకు అని కానిస్టేబుల్ స‌ర్టిఫై చేస్తే... ఇక ఫైన్ రాసేస్తార‌న్న‌మాట‌. బ్రీత్ ఎన‌లైజ‌ర్ ఏది బాబూ అంటే... అదేంటి అని ఎదురు ప్ర‌శ్నిస్తారా కానిస్టేబుళ్ళు... న‌గ‌రాల‌ల‌లో బ్రీత్ ఎన‌లైజ‌ర్‌లో నోరు పెట్టి ఊద‌డానికి ఎవ‌రికి వారికి కొత్త స్ట్రాలు వాడ‌క‌పోతే చిరాకుప‌డే న‌గ‌ర పౌరులున్న ఈ కాలంలో ఇలా చెక్కిలిపై చెక్కిలి పెట్టి వామ్మో... ఇదేం చెకింగ్ అనుకుంటున్నారా?... ఇది బీహారండీ బాబు.