శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 16 జనవరి 2017 (10:09 IST)

చాంద్రాయణగుట్ట పరిధిలో దారుణం.. సోదరిపై అన్నయ్య అత్యాచారం

వరుసకు సోదరి అయిన ఓ బాలికపై బాలుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలోని గుల్షన్ ఎక్బాల్ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఈ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి మొదటి భార్యత

వరుసకు సోదరి అయిన ఓ బాలికపై బాలుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలోని గుల్షన్ ఎక్బాల్ కాలనీలో చోటుచేసుకుంది.  పోలీసుల కథనం ప్రకారం... ఈ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు. వీరికి కుమార్తె(16) ఉంది. వ్యాపారి రెండో భార్య కుమారుడు(17) ఈ బాలికపై శనివారం అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
 
పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న గంగా సాగర్ మేళాలో ఆదివారం అపశ్రుతి చోటు చేసుకుంది. మకర సంక్రాంతి వేడుకల్లో భాగంగా జరుగుతున్న గంగాసాగర్ మేళాలో పాల్గొనడానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. కచుబేరియాప్రాంతంలో భక్తులు పడవ ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా, పలువురుకి గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.