Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కామనరం కట్టలు తెంచుకున్న క్యాబ్ డ్రైవర్: బెంగళూరు ఫ్యామిలీకి నరకం

హైదరాబాద్, బుధవారం, 19 ఏప్రియల్ 2017 (07:25 IST)

Widgets Magazine

ఒక్క క్షణం సందు దొరికితే ఆడదాన్ని శరీరాన్ని తూట్లు పొడిచేలా చూడటమే కాదు అవకాశం దొరికితే అంగాంగంతో ఆడుకునే మృగాళ్లకు కామనరం కట్టలు తెంచుకుందా అనిపిస్తుంది. అమ్మాయిలతో అతిగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా పట్టుబడతామని తెలిసీ తెలిసీ కూడా ఒంటరిగా కనిపించడాన్ని ఛాన్సు తీసుకుని అమ్మాయిలను నలిపేసే మగ దురహంకారానికి హద్దులు లేకుండా పోతున్నాయా.. క్యాబ్ డ్రైవర్ వివరాలు ఇకేమాత్రం సీక్రెట్ కాదని తెలిసి కూడా డ్రైవర్ సీటు పక్కన కూర్చున్న పాపానికి ఆ పరాయి రాష్ట్రపు పర్యాటకురాలిపై వికృత చేష్ట్యలకు పాల్పడి హైదరాబాద్ పరువు పోగొట్టాడో క్యాబ్ డ్రైవర్.
 
ఇది బెంగళూరు నుంచి నగర పర్యటనకు వచ్చిన ఓ పర్యాటకురాలికి ఎదురైన చేదు అనుభవం. ఆమె తన కుటుంబీకులతో కలిసి హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఓ ట్రావెల్ ఏజెన్సీ నుంచి క్యాబ్‌ను మాట్లాడుకున్నారు. నలభై ఏళ్ల మహ్మద్ సలీం డ్రైవర్‌గా వచ్చాడు. ఎలాంటి అవాంతరాలు లేకుండా పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లేటప్పుడు ఆ కుటుంబానికి నరంకం చూపించాడీ డ్రైవర్. 
 
రైల్వే స్టేషన్ బయలు దేరేటప్పుడు ఆ యువతి క్యాబ్ డ్రైవర్ పక్క సీటులో కూర్చుంది. అదే ఆమె చేసిన నేరం. కుటుంబీకులు వెనుక సీట్లో కూర్చున్నారన్న భయం కూడా లేకుండా దారిలోనే ఆ డ్రైవర్ సలీం ఆ అమ్మాయితో వికృతంగా ప్రవర్తించసాగాడు. డ్రైవింగ్ చేస్తూనే ఆమె అంగాంగాన్నీ తడమసాగాడు. అసహ్యమైన భావంతో  ఆ యువతి కారు ఆపమన్నా ఆపకుండా వెళ్లిన డ్రైవర్ కాసేపటికి కారు ఆపాడు. తండ్రితో విషయం చెబుతుండగానే వారి లగేజి నడిరోడ్డుపై పడేసిన సలీం అక్కడి నుంచి ఉడాయించాడు. 
 
బెంగళూరు చేరుకున్న తర్వాత నగరంలోని షీ-టీమ్స్‌కి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. మంగళవారం నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నేరచర్యలు జరిగితే వాట్సాప్ ద్వారా విషయం తెలపాలన్న జ్ఞానం ఆ అమ్మాయికి ఉంది కాబట్టి వెంటనే తన సమస్యకు పరిష్కారం కనుగొంది. అలాంటి ఘటన జరగగానే షాక్‌కు గురై బయటకి చెప్పుకోలేక ఎంతమంది అమ్మాయిలు మగాళ్లపై విద్వేషాన్ని, అనుచుకుంటూ ఉన్నారో మరి.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భారతీయ ఐటీ పరిశ్రమపై ట్రంప్ పిడుగుపాటు.. హెచ్-1బి నిబంధనలు కఠినతరం

పాతికేళ్ల బారత ఐటీ ప్రస్థానంలో భారీ పిడుగుపాటు. విదేశీయులు అమెరికాలో పని చేసేందుకు వీలుగా ...

news

దినకరన్‌కి 9 మంది ఎమ్మెల్యేల మద్దతు: శశికళ బలం ఇంతేనా.. అందుకే ఔట్

తమిళనాడుకు గత మూడు నెలలుగా పట్టిన శని ఇక వదిలినట్లేనా..పన్నీర్ సెల్వంకి సాధ్యం కాని పని ...

news

స్నానం చేస్తున్న యువతిని వీడియో తీసి దాన్ని ఆమెకు చూపి... ఆపై...

ఓ కామాంధుడు పక్కింటిలో వున్న యువతిపై కన్నేశాడు. ఆమె స్నానం చేస్తుండగా తన కెమేరాలో ఆమె ...

news

రజనీకాంత్‌కు రాజకీయాలు తెలియవన్న స్వామి- ఇండియన్ మీడియా అంటూ మాల్యా ఎద్దేవా

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు రాజకీయాల గురించి తెలియదని.. ఆయన కేవలం నటుడు మాత్రమేనని.. ...

Widgets Magazine