Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అదిగో పులి... ఇదిగో తోక... జగన్ గుండెల్లో రైళ్లంటూ...!!?

శనివారం, 13 మే 2017 (20:43 IST)

Widgets Magazine
lakshmi narayana

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయట. ఇదీ ఇప్పుడు సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో జరుగుతున్న గోల. ఇంతకీ ఏంటయా సంగతి అంటే... జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి అప్పట్లో విచారణ చేసిన సీబీఐ జేడీ ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణను తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమ్యాయట. తెలుగువారైన లక్ష్మీనారాయణ మహారాష్ట్ర క్యాడర్‌కు ఐపీఎస్‌ అధికారిగా ఎంపికయ్యారు.
 
ఆ ప్రాంతంలోనే ఇప్పుడు అదనపు డీజీ హోదాలో పనిచేస్తున్నారు. మధ్యలో కొంతకాలం కేంద్ర సర్వీసులకు వెళ్లి హైదరాబాద్‌ సీబీఐ విభాగం జేడీగా వచ్చారు. జెడీ హయాంలోనే జగన్‌ అక్రమాస్తుల కేసు, ఓబులాపురం మైనింగ్‌ కుంభకోణం, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ వంటి సంచలనాత్మక కేసులు దర్యాప్తు జరిగాయి. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో పాటు పలువురు ఐఏఎస్‌లు, పారిశ్రామికవేత్తలను అరెస్టు చేయడంతో లక్ష్మీనారాయణ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. 
 
డిప్యుటేషన్‌ పూర్తికావడంతో ఆయన తిరిగి మహారాష్ట్ర క్యాడర్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం లక్ష్మీనారాయణ హైదరాబాద్‌ రావాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. రెండు ప్రభుత్వాలూ అంగీకరిస్తే జెడి మళ్లీ డిప్యుటేషన్‌పై ఇక్కడకు రావడానికి పెద్దగా అభ్యంతరం ఉండదు. జె.డి. తెలుగు రాష్ట్రానికి వస్తే మళ్లీ జగన్ మోహన్ రెడ్డికి కష్టాలు తప్పవనీ, అందుకే ఆయన గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఐతే అసలు సీబీఐ అధికారి లక్ష్మినారాయణ ఇక్కడికి బదిలీ అవుతారా... అయితే మాత్రం జగన్ కేసును మళ్లీ ఆయనే చూస్తారా అన్నది ప్రశ్న. ఐతే దీనిపై చర్చ మాత్రం ఓ స్థాయిలో పరుగులు తీస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కుమారుడితో పిజ్జా షాపుకెళ్లిన ఆర్మీ స్కూల్ టీచర్‌ దారుణ హత్య: 28సార్లు కత్తితో పొడిచి?

ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేసిన మహిళ దారుణ హత్యకు గురైంది. పిజ్జా ...

news

తిరుపతి పోలీస్ స్టేషన్‌లలో సమాచారం గోవిందా...!

అంతర్జాల సైబర్ ఎటాక్ తిరుపతిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలోని ...

news

పెళ్లికి నిరాకరించిందని ఫ్రెండ్స్‌తో కలిసి గ్యాంగ్ రేప్, ప్రైవేట్ భాగంలో పదునైన వస్తువులను...

వన్ సైడ్ లవ్ అనేది ఎంతటి దారుణాలను చేయిస్తుందో ఈ ఘటన చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ...

news

వాళ్లకి కావల్సింది కిడ్నీ, లైంగిక సుఖం... కాదంటే తొక్కేస్తారు...

ప్రపంచంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు పెచ్చుమీరుతున్నాయి. లైంగిక అవసరాలు తీర్చుకునే ...

Widgets Magazine