Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అయ్యా... లే అయ్యా... నీ కోసం ఎంత మంది వచ్చారో చూడయ్యా...

గురువారం, 8 ఫిబ్రవరి 2018 (10:33 IST)

Widgets Magazine
gali muddu krishnama naidu

డెంగీ జ్వరం కారణంగా చనిపోయిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసనమండలి సభ్యుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో గురువారం సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో జరుగనున్నాయి. గత రెండు నెలల క్రితం గుండె ఆపరేషన్ చేయించుకున్న ముద్దుకృష్ణమకు గత నాలుగు రోజుల క్రితం అనారోగ్యం చేసింది. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా డెంగీ జ్వరం వచ్చింది. దీంతో ఆయన మంగళవారం అర్థరాత్రి హఠాన్మరణం చెందారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు.. టీడీపీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యారు. 
 
అయితే, ముద్దుకృష్ణమ నాయుడు చనిపోయే ముందు తన భార్య, పిల్లల కంటే కూడా ఓ వ్యక్తిని చూడాలని పరితపించాడు. అతన్ని తక్షణం హైదరాబాద్‌కు పిలిపించాలని తన కుటుంబ సభ్యుల ద్వారా కబురుబెట్టాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా. తన నమ్మినబంటు. గడచిన 20 సంవత్సరాలుగా తన వాహన డ్రైవరుగా, వ్యక్తిగత సహాయకుడిగా, నమ్మినబంటుగా ఉన్న వ్యక్తి చంద్ర. గాలి ముద్దుకృష్ణమనాయుడితో రెండు దశాబ్దాల పాటు నడిచిన చంద్రే, గతవారం జ్వరంతో ఉన్న ఆయన్ను రేణిగుంట విమానాశ్రయానికి తీసుకెళ్లి హైదరాబాద్ విమానం ఎక్కించారు. 
 
కేర్ ఆసుపత్రిలో చేరి డెంగ్యూ జ్వరానికి చికిత్స పొందుతున్న వేళ, పరిస్థితి విషమించింది. ఆపై తన కుటుంబీకులతో చంద్రను పిలిపించాలని, వాడిని చూడాలని ఉందని గాలి చెప్పారట. విషయాన్ని చంద్రకు చేరవేసిన బంధువులు, అతన్ని హుటాహుటిన మంగళవారం నాడు హైదరాబాద్‌కు రప్పించారు. అప్పటికే గాలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆయన్ను చూసిన చంద్ర కుదేలయ్యాడు. ఆయన మరణించిన తర్వాత 'అయ్యా... లే అయ్యా... నీ కోసం ఎంత మంది వచ్చారో చూడయ్యా' అంటూ బోరున విలపిస్తుండటం ఇతరులను కూడా కంటతడిపెట్టించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రేణుకా చౌదరిని మోదీ ఇలా అనేశారే? రామాయణం తర్వాత ఆ నవ్వును..?

''ట్రిపుల్ తలాక్'' బిల్లు ఓ ఒక్క కమ్యూనిటినో ఉద్దేశించినది కాదని.. ఇదే నేరం కింద హిందూ ...

news

మిస్టర్ ప్రైమ్‌మినిస్టర్.. తెలుగు ప్రజలు ఫూల్స్ కాదు : టీడీపీ

'మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌, మిస్టర్‌ ఫైనాన్స్‌ మినిస్టర్‌! సభా వేదిక నుంచి డిమాండ్‌ ...

news

మీరిచ్చిన నిధుల కంటే.. 'బాహుబలి' కలెక్షన్లే అధికం : గల్లా జయదేవ్

పార్లమెంట్ సాక్షిగా బీజేపీ నేతలను టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కడిగిపారేశారు. అడ్డగోలు విభజన ...

news

బంద్‌కు జనసేన మద్దతు: విరమించండి, పార్లమెంట్‌లో కలసి రండంటున్న మంత్రులు

అమరావతి: కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని వామపక్షాలు ఇచ్చిన రాష్ట్ర ...

Widgets Magazine