సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 జనవరి 2020 (10:34 IST)

నూతన సంవత్సర వేడుకలకు చంద్రబాబు దూరం

నూతన సంవత్సర వేడుకలకు దూరంగా వున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తన ట్విట్టర్‌లో "అందరూ సంతోషంగా ఉన్నప్పుడే ఏ వేడుకైనా శోభాయమానంగా ఉంటుంది. కానీ ఈరోజు అమరావతి రైతులు సంతోషంగా లేరు. వారికి సంఘీభావంగా 2020 నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని" టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
 
అంతేకాదు 'వేడుకలకయ్యే ఖర్చులను రైతుల కోసం పోరాడే అమరావతి పరిరక్షణ సమితి జెఎసిలకు విరాళంగా ఇవ్వాలి. రాజధాని అమరావతి పరిరక్షణ రాష్ట్రంలో అందరి సంకల్పం కావాలి. రాబోయే నూతనసంవత్సరంలో అన్నివర్గాల ప్రజల ధన,మాన,ప్రాణాలకు భద్రత ఏర్పడాలని, వారి సమస్యలు పరిష్కారం కావాలని ఆశిస్తున్నాను' అని చంద్రబాబు తెలిపారు.
 
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కనెక్ట్ టు ఆంధ్రా సొసైటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిటీ నిధుల నిర్వహణ కోసం ఈ సొసైటీని ఏర్పాటు చేశారు.
 
లాభాపేక్ష రహిత సంస్థగా కనెక్ట్ టు ఆంధ్రా సొసైటీ ఉంటుంది. సీఎస్ఆర్ నిధుల నిర్వహణ కోసం ఉన్నత, క్షేత్రస్థాయిలో రెండు వేర్వేలు కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. కనెక్ట్ టు ఆంధ్రా కోసం సీఎం జగన్ నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు కానుంది. ఈ కమిటీలో సభ్యులుగా ఆర్థిక మంత్రి, సీఎస్ సహా 3 ప్రముఖ సంస్థలకు చెందిన ప్రతినిదులు ఉండనున్నారు.