శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 2 జులై 2015 (16:44 IST)

2018 నాటికి పోలవరం పూర్తి చేస్తాం.. నీరందిస్తాం : చంద్రబాబు

వచ్చే 2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి నీరు అందిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన సందర్భంగా పోలవరం ప్రాజెక్టుపై ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం పనుల పురోగతిపై కేబినెట్‌లో ఎప్పటికప్పుడు చర్చిస్తామన్నారు. గత ప్రభుత్వం అమలు చేయని పునరావాస ప్యాకేజీని కూడా తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. 
 
ప్రభుత్వసాయం లేకున్నా కాంట్రాక్టర్లు పనులు చేయడాన్ని ఆయన ప్రశంసించారు. గోదావరి వరదలతో పట్టిసీమ ప్రాజెక్టు పనులకు అంతరాయం కలుగుతోందని అన్నారు. వచ్చే ఆగస్టు 15 నాటికి గోదావరి నీటిని కుడి కాలువకు మళ్లిస్తామని చంద్రబాబు తెలిపారు.
 
ఇకపోతే.. పగో జిల్లాలో తీరప్రాంతం తక్కువగా ఉందన్నారు. అటవీభూములకు క్లియరెన్స్‌ అడిగామని.... అది వచ్చాక పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గోదావరి కాలువలకు మరమ్మతులు చేసి చివరి భూములకు నీరు అందేలా చూస్తామన్నారు. మెట్ట ప్రాంతాలకు లిఫ్ట్‌లతో సాగునీరందించనున్నట్లు చెప్పారు.