శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 24 నవంబరు 2014 (16:03 IST)

సూర్యోదయ దేశంలో సూర్యోదయ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్ చేరుకున్నారు. సూర్యోదయ దేశం నుంచి సూర్యోదయ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే లక్ష్యంతో తాను జపాన్‌కు వచ్చినట్లు చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబుతో వెంట 18 మంది ప్రతినిధులు ఉన్న బృందం జపాన్ చేరుకుంది. అక్కడ రాయబార కార్యాలయ అదికారులు చంద్రబాబుకు స్వాగతం చెప్పారు. 
 
చంద్రబాబు నాయుడు బృందం జపాన్‌లోని కన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకున్నారు. ఆదివారం అర్థరాత్రి హైదరాబాద్ నుంచి జపాన్ పర్యటన కోసం బయలుదేరిన చంద్రబాబు నేతృత్వంలోని 18 మంది సభ్యుల బృందం సోమవారం మధ్యాహ్నానికి కన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. అక్కడ నుంచి క్యోటో వెళ్లారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల సేకరణే లక్ష్యంగా వెళ్లిన సీఎం, సూర్యోదయ దేశం నుంచి సూర్యోదయ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం ఆరు రోజుల పర్యటనలో జపాన్ ప్రధాని, పారిశ్రామికవేత్తలతో బాబు బృందం సమావేశమై చర్చించనుంది. రాష్ట్ర శక్తి సామర్థ్యాలపై ప్రత్యేక డాక్యుమెంటరీ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా పలు సంస్థలతో ఆరు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది.