శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 15 ఆగస్టు 2018 (15:23 IST)

విభజన తర్వాత తెలంగాణ అభివృద్ధి అమోఘం.. కేసీఆర్

తెలంగాణ రాష్ట్రం అన్నీ రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. తెలం

తెలంగాణ రాష్ట్రం అన్నీ రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. తెలంగాణ ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలోనే అనూహ్యంగా ప్రగతి పథకంలో దూసుకెళ్లిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తద్వారా నేడు యావత్ దేశానికి ఒక ఆదర్శవంతమైన అభివృద్ధి నమూనాను అందించిందని తెలిపారు. 
 
సమైక్య రాష్ట్రంలో కుదేలైన రంగాలన్ని నేడు పునరుత్తేజం పొందాయన్నారు సీఎం. సంక్షేమ పథకాలు అణగారిన వర్గాలకు అండదండలు కల్పిస్తున్నాయన్నారు. సమయం వృథా చేయకుండా తెలంగాణను అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నామని కేసీఆర్ అన్నారు. 
 
ఏపీ విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎంతో పరిణతితో వ్యవహరించిందని, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించడంలో సంపూర్ణంగా నిమగ్నమైందని ఇటీవల పార్లమెంట్‌లో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే ప్రస్తావించారని కేసీఆర్ గుర్తు చేశారు. 
 
ఈ నాలుగు సంవత్సరాల విలువైన సమయాన్ని తెలంగాణ భవిష్యత్‌కు తగిన అభివృద్ధి ప్రాతిపదికలు నిర్మించేందుకు సమర్థవంతంగా వినియోగించుకున్నామని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రస్థానం జరుగుతుందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని పటిష్టపరిచే దిశగా ప్రభుత్వం నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకుంటున్నదని సీఎం స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉండేదన్నారు. 
 
ఇప్పటికే రూ. 17 వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేశామని తెలిపారు. రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని కేసీఆర్ స్పష్టం చేశారు. భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు భూరికార్డుల ప్రక్షాళనను చేపట్టి విజయవంతంగా పూర్తి చేశామన్నారు.