1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 15 జులై 2018 (15:18 IST)

కేసీఆర్‌తో భేటీకానున్న ఏపీ టీడీపీ ఎంపీలు... అవిశ్వాసానికి మద్దతు..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌తో తెలుగుదేశం పార్టీకి చెందిన ఏపీ నేతలు సమావేశంకానున్నారు. ఏపీకి కేంద్రం చేసిన అన్యాయం గురించి కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల నేతలను కలుసుకుని వారికి వ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌తో తెలుగుదేశం పార్టీకి చెందిన ఏపీ నేతలు సమావేశంకానున్నారు. ఏపీకి కేంద్రం చేసిన అన్యాయం గురించి కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల నేతలను కలుసుకుని వారికి వివరించనున్నారు.
 
ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఏపీ టీడీపీ ఎంపీలు అశోక్ గజపతిరాజు, కొనకళ్ల నారాయణ, శివప్రసాద్ తదితరులు కలవనున్నట్టు సమాచారం. చంద్రబాబు రాసిన లేఖతో పాటు విభజన హామీల అమలులో వైఫల్యాలపై రాసిన పుస్తకాన్ని కేసీఆర్‌కు అందజేయనున్నట్టు తెలుస్తోంది. 
 
దీనిపై టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి స్పందిస్తూ, విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి కేసీఆర్‌కు వివరిస్తామని తెలిపారు. ఏపీకి జరిగిన అన్యాయం, విభజన హామీల అమలుపై చర్చించామన్నారు. 
 
ఏపీకి అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని టీఆర్ఎస్ నేతలు అంగీకరించారని, త్వరలో జరగబోయే అఖిలపక్ష భేటీలో ఈ అంశాన్ని లేవనెత్తాలని కోరామని చెప్పారు. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై అవిశ్వాసతీర్మానం పెడతామని, ఇందుకు టీఆర్ఎస్ మద్దతు కోరగా అందుకు సానుకూలంగా స్పందించిందని అన్నారు.